Indian Startups: దేశంలోని టాప్ 200 స్టార్టప్‌ల విలువ ఎన్ని లక్షల కోట్లు అంటే?

Indian Startups Value at 42 Lakh Crore in 2025
  • 42 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న టాప్ 200 కంపెనీల వ్యాల్యూ
  • గత ఏడాదితో పోలిస్తే 15 శాతం వృద్ధి
  • అత్యధిక కంపెనీలు కలిగిన నగరంగా స్థానాన్ని నిలబెట్టుకున్న బెంగళూరు
భారతదేశంలోని టాప్ 200 స్వయం-నిర్మిత ఎంటర్‌ప్రెన్యూయర్లకు (స్టార్టప్) చెందిన అన్ని కంపెనీల విలువ 2025లో రూ. 42 లక్షల కోట్లు (469 బిలియన్ డాలర్లు)గా ఉంది. ఇది గత సంవత్సరం రూ. 36 లక్షల కోట్లు (431 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. ఏడాది ప్రాతిపదికన 15 శాతం వృద్ధిని ఇది ప్రతిబింబిస్తూ, భారతదేశ స్వయం-నిర్మిత పారిశ్రామికవేత్తల వేగవంతమైన సంపద సృష్టిని నొక్కి చెబుతోందని ఒక నివేదిక పేర్కొంది.

2025లో 128 కంపెనీలు బిలియన్ డాలర్ల వ్యాల్యుయేషన్‌ను కలిగి ఉన్నాయి. గత ఏడాది ఈ సంఖ్య 121గా ఉంది. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ ప్రైవేట్, హురున్ ఇండియా జాబితా ప్రకారం 22 కొత్త కంపెనీలు ఈ జాబితాలో చేరాయి. రూ. లక్ష కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన కంపెనీలు ఐదు ఉన్నాయి.

అత్యధిక స్టార్టప్‌లు కలిగిన నగరంగా బెంగళూరు నిలిచింది. గత సంవత్సరంతో పోలిస్తే 14 కంపెనీలు తగ్గినప్పటికీ 52 కంపెనీలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా ముంబై (41), గురుగ్రామ్ (36) ఉన్నాయి. ముంబై, గురుగ్రామ్‌లలో గత ఏడాదితో పోలిస్తే ఐదు స్టార్టప్‌లు పెరిగాయి.

88 మంది స్టార్టప్ వ్యవస్థాపకులతో బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత ముంబై (83), ఢిల్లీ (52) ఉన్నాయి. ఈ నగరాలు అత్యధిక సంఖ్యలో స్టార్టప్ వ్యవస్థాపకులను కలిగి ఉన్నాయి. దేశంలోని స్టార్టప్ కంపెనీలలో 47 ఫైనాన్షియల్ సర్వీసెస్, 28 సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్, 27 హెల్త్ కేర్, 20 రిటైల్ రంగాల్లో ఉన్నాయి.
Indian Startups
Startup valuation
India startup ecosystem
Bengaluru startups

More Telugu News