Prithviraj Chavan: ఆపరేషన్ సిందూర్‌పై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పనన్న చవాన్.. బీజేపీ ఆగ్రహం
- ఆపరేషన్ తొలిరోజే భారత్ ఓడిపోయిందంటూ పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యలు
- ఇది సైన్యాన్ని అవమానించడమేనన్న బీజేపీ
- చవాన్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్న కాంగ్రెస్
'ఆపరేషన్ సిందూర్'పై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, అందువల్ల క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ వ్యవహారం అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.
మే నెలలో పాకిస్థాన్‌తో జరిగిన 'ఆపరేషన్ సిందూర్' సైనిక చర్యలో తొలిరోజే భారత్ ఓడిపోయిందని చవాన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో పాక్ దళాలు భారత సైనిక విమానాలను కూల్చివేశాయని, ఫలితంగా భారత వైమానిక దళం కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని ఆయన పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు.
చవాన్ వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. మన సైనికుల పరాక్రమాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మన బలగాలను అవమానించడం అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పుడూ పాకిస్థాన్‌కు అనుకూలంగానే వ్యవహరిస్తుందని, ఎన్నికల్లో వరుస ఓటములతో ఆ పార్టీ నేతలు మానసిక సమతుల్యత కోల్పోయారని బీజేపీ నేతలు ఆరోపించారు.
మరోవైపు, ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించి, చవాన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలకు ఆధారాలు ఏమిటో పృథ్వీరాజ్ చవానే చెప్పాలని ఝార్ఖండ్ కాంగ్రెస్ ఎంపీ సుఖ్‌దేవ్ భగత్ అన్నారు. తమకు సైన్యం పట్ల గర్వంగా ఉందని, ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని తెలిపారు.
ఏమిటీ ఆపరేషన్ సిందూర్?
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ "ఆపరేషన్ సిందూర్" చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న 9 ఉగ్ర స్థావరాలను భారత దళాలు ధ్వంసం చేశాయి. పాకిస్థాన్‌కు చెందిన నాలుగు ఫైటర్ జెట్లను కూల్చివేసినట్లు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గతంలోనే ప్రకటించారు. భారత విమానాలను కూల్చివేశామన్న పాక్ వాదనలను ఆయన ఖండించారు. అది కేవలం పాక్ పౌరులను మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రచారమని కొట్టిపారేశారు.