Preity Zinta: చాలా కాలం తర్వాత ఒంటరిగా సినిమా చూశా.. మాటలు రాలేదు: ప్రీతి జింటా
- రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ సినిమాపై ప్రశంసలు కురిపించిన ప్రీతి జింటా
- ఇది దేశాన్ని కాపాడే సైనికులకు రాసిన ప్రేమలేఖ అని వ్యాఖ్య
- సినిమా చూశాక మాటలు రాలేదంటూ దర్శకుడిని కొనియాడిన ప్రీతి
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ప్రముఖ నటి ప్రీతి జింటా, సోషల్ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా ఒక అద్భుతమని, ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని ఆమె కోరారు.
ఈ విషయంపై ట్విట్టర్‌లో పోస్ట్ పెడుతూ.. "చాలా కాలం తర్వాత ఒంటరిగా థియేటర్‌లో సినిమా చూశాను. మధ్యాహ్నం షో కూడా హౌస్‌ఫుల్ అవ్వడం చూసి ఆశ్చర్యపోయాను. ఈ మధ్యకాలంలో నేను చూసిన అత్యుత్తమ చిత్రాల్లో ఇది ఒకటి. ఎంతో సహజంగా, వాస్తవికంగా ఉంది. ముఖ్యంగా దర్శకుడు ఆదిత్య ధర్ పనితీరు నన్ను కట్టిపడేసింది. ఎంతో కష్టమైన కథను ఆయన గొప్పగా తెరకెక్కించారు" అని ప్రీతి పేర్కొన్నారు.
"ఇది కేవలం ఒక సినిమా కాదు. మన దేశాన్ని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టే ప్రతి అజ్ఞాత సైనికుడికి, దేశభక్తుడికి రాసిన ప్రేమలేఖ లాంటిది. మూడున్నర గంటల సినిమా క్షణాల్లో గడిచిపోయింది. సినిమా చూశాక నాకు మాటలు రావడం లేదు. దర్శకుడు ఆదిత్యకు ఫోన్ చేసి నా అనుభూతిని పంచుకుంటాను. ఈ కళాఖండాన్ని ప్రేక్షకులు అస్సలు మిస్ అవ్వొద్దు" అని ప్రీతి జింటా తన పోస్టులో రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఆమె అభినందనలు తెలిపారు.