ఐపీఎల్ 2026 తర్వాత ధోనీ రిటైర్మెంట్ ఖాయం: రాబిన్ ఊతప్ప
- ఐపీఎల్ 2026 సీజనే ధోనీకి చివరిదన్న రాబిన్ ఊతప్ప
- యువ ఆటగాళ్లపై సీఎస్‌కే భారీగా పెట్టుబడులు పెట్టడమే నిదర్శనమని వ్యాఖ్య
- వేలంలో ఇద్దరు యువ ఆటగాళ్ల కోసం రూ. 28 కోట్లకు పైగా ఖర్చు
- ఆటగాడిగా తప్పుకుని మెంటార్ పాత్రలోకి మహీ మారడం ఖాయమన్న మాజీ క్రికెటర్
- ధోనీ భవిష్యత్‌పై ఊహాగానాలకు తెరపడిందన్న ఊతప్ప
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్‌పై ఇక ఎలాంటి అనుమానాలకు తావు లేదని, ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత అతను కచ్చితంగా ఆటకు వీడ్కోలు పలుకుతాడని భారత మాజీ ఆటగాడు, ధోనీ సహచరుడు రాబిన్ ఊతప్ప స్పష్టం చేశాడు. సీఎస్‌కే ఫ్రాంచైజీ తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకోవడం, అనుభవజ్ఞుల కంటే యువ ఆటగాళ్లపై భారీగా పెట్టుబడులు పెట్టడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నాడు.
నిన్న జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై ఈ విషయాన్ని రుజువు చేసింది. 19 ఏళ్ల ప్రశాంత్ వీర్, 20 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ కార్తీక్ శర్మ అనే ఇద్దరు యువ ఆటగాళ్లను చెరో రూ. 14.2 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లుగా వారు నిలిచారు. ఈ పరిణామాలపై ఊతప్ప మాట్లాడుతూ.. "ఇక గోడ మీద రాత స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కచ్చితంగా ధోనీకి చివరి సీజన్ అవుతుంది. అతను మళ్లీ ఆడతాడా? లేదా? అనే ఊహాగానాలకు ఇక చోటు లేదు. ఈ ఏడాదితో అతను పూర్తిగా ఆటకు వీడ్కోలు పలుకుతాడు" అని వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం 44 ఏళ్ల ధోనీ, ఆటగాడిగానే కాకుండా మెంటార్‌గా కూడా జట్టును సిద్ధం చేస్తున్నాడని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. "ధోనీ ఆడకపోయినా, అతను జట్టుకు మెంటార్‌గా ఉంటాడని మనందరికీ తెలుసు. ఈ ఏడాది అతను ప్లేయర్-కమ్-మెంటార్‌గా వ్యవహరిస్తాడని నేను భావిస్తున్నాను. ఆ కోణంలోనే అతను ఆలోచిస్తున్నాడు. అందుకే ఇలాంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటున్నారు" అని చెప్పుకొచ్చాడు.
గత కొన్ని సీజన్లుగా ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ జరుగుతున్నప్పటికీ, అభిమానుల కోసం అతను తన కెరీర్‌ను కొనసాగిస్తూ వచ్చాడు. అయితే, యువతకు పెద్దపీట వేస్తూ సీఎస్‌కే తీసుకుంటున్న తాజా నిర్ణయాలు, ధోనీ శకం ముగింపునకు నాంది పలుకుతున్నాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.