Mandal Rajitha: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచిన లేడీ యూట్యూబర్

Mandal Rajitha wins as Sarpanch in Telangana Panchayat Elections
  • షార్ట్ ఫిల్మ్ నటి నుంచి గ్రామ సర్పంచ్‌గా రజిత
  • హనుమకొండ జిల్లా రంగయ్యపల్లిలో విజయం
  • స్వతంత్ర అభ్యర్థిగా 37 ఓట్ల తేడాతో గెలుపు
  • ఇన్‌స్టాగ్రామ్‌లో రజితకు 3 లక్షల మంది ఫాలోవర్లు
షార్ట్ ఫిల్మ్స్, సోషల్ మీడియా ద్వారా విశేషమైన అభిమానులను సంపాదించుకున్న ఒక యువతి, ఇప్పుడు ప్రజాప్రతినిధిగా తన నూతన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండల రజిత అనే యూట్యూబర్ సర్పంచ్‌గా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించారు.

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రంగయ్యపల్లి గ్రామ సర్పంచ్ పదవిని బీసీ మహిళకు రిజర్వ్ చేశారు. ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన రజిత, తన సమీప ప్రత్యర్థిపై 37 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు. గతంలో ఆమె భర్త మహేశ్ ఇదే పదవికి పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు భార్య గెలుపుతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

షార్ట్ ఫిల్మ్స్ నటిగా గుర్తింపు పొందిన రజితకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమెకున్న ఈ సోషల్ మీడియా ఫాలోయింగే ఎన్నికల్లో గెలుపునకు దోహదపడిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కళారంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి విజయం సాధించిన ఆమెను పలువురు అభినందిస్తున్నారు. 
Mandal Rajitha
Telangana Panchayat Elections
Rangayapalli
Hanumakonda
YouTuber Sarpanch
Short Films
Social Media Influencer
Telangana Elections 2024

More Telugu News