ప్రమాదాల నివారణకు ఇక ఆ ప్రాంతాల్లో ఎరుపు రంగు రోడ్లు!
- వన్యప్రాణులు మృత్యువాత పడకుండా ఎన్‌హెచ్ఏఐ వినూత్న ఆలోచన
- సెన్సిటివ్ జోన్‌లలో రోడ్లపై ఎర్రని రంగుతో మార్కింగ్
- జబల్‌పూర్-భోపాల్ జాతీయ రహదారిలో 12 కిలోమీటర్ల మేర ఇప్పటికే రోడ్డు
నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం మీదుగా వెళ్లే రహదారిలో ప్రమాదాలను నివారించడానికి ఎన్‌హెచ్ఏఐ రోడ్డుపై ఎరుపు రంగుతో పెయింట్ వేసింది. ఈ రోడ్డు 12 కిలోమీటర్ల పొడవు ఉంది. ఇంతకుముందు ఈ రోడ్డు రెండు లైన్లుగా ఉండగా, ఎన్‌హెచ్ఏఐ ఇప్పుడు దీనిని నాలుగు లైన్లుగా మార్చింది. వాహనాల వేగాన్ని అదుపు చేయడానికి ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.