Roshan Sadashiv: తీసుకున్న రుణం రూ.1 లక్ష... వడ్డీతో కలిపి రూ.74 లక్షలు... చెల్లించేందుకు కిడ్నీ అమ్ముకున్న రైతు

Roshan Sadashiv Farmer Sells Kidney to Repay 74 Lakh Debt
  • మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఘటన
  • అధిక వడ్డీలకు తీసుకోవడంతో భారీగా పెరిగిన అప్పు
  • కంబోడియాకు తీసుకెళ్లి రైతు కిడ్నీని విక్రయించి అప్పు తీర్చుకున్న రుణదాత
మహారాష్ట్రకు చెందిన ఓ రైతు రూ. లక్ష రుణం తీసుకుంటే, అది వడ్డీతో కలిపి రూ.74 లక్షలకు చేరింది. దీంతో తన కిడ్నీ అమ్ముకున్నాడు. అధిక వడ్డీ కారణంగా అతని అప్పు రూ. 74 లక్షలకు చేరుకుంది.

చంద్రపూర్‌ జిల్లాకు చెందిన రోషన్‌ సదాశివ్‌ అనే రైతు డెయిరీ ఫామ్‌ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ. లక్ష అప్పు తీసుకున్నాడు. అధిక వడ్డీలకు తీసుకున్న ఆ అప్పులకు వడ్డీలు చెల్లించడం కోసం మళ్లీ అప్పులు చేశాడు. అలా ఆ అప్పులు మొత్తం రూ. 74 లక్షలకు చేరాయి. అప్పుల వాళ్ల నుంచి ఒత్తిళ్లు పెరిగాయి.

దాంతో సదాశివ్‌ తన వ్యవసాయ భూమిని, ట్రాక్టర్‌ను, ఇంట్లోని విలువైన వస్తువులను విక్రయించి అప్పులు చెల్లించాడు. అయినా ఇంకా అప్పులు మిగిలే ఉండటంతో రుణదాత బలవంతంగా అతడిని కాంబోడియాకు తీసుకెళ్లి రూ. 8 లక్షలకు కిడ్నీని అమ్మించి, తన అప్పు తీర్చుకున్నాడు. ఒక ఏజెంట్ ద్వారా అతను కోల్‌కతా వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుని, అక్కడి నుండి కంబోడియా వెళ్లి కిడ్నీ అమ్ముకున్నాడు.

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. తనకు న్యాయం చేయకపోతే ముంబైలోని మంత్రాలయలో ఉన్న స్టేట్‌ హెడ్‌క్వార్టర్స్‌ ముందు కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని చెబుతున్నాడు.
Roshan Sadashiv
Maharashtra farmer
loan debt
kidney selling
Chandrapur district

More Telugu News