Rahul Gandhi: మోదీకి ఆ రెండు అంశాలు అసలే గిట్టవు: రాహుల్ గాంధీ

Rahul Gandhi says Narendra Modi dislikes two things
  • గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై రాహుల్ గాంధీ ఆగ్రహం
  • రాహుల్ గాంధీ ఆలోచనలు, పేదల హక్కులు మోదీకి నచ్చవని వ్యాఖ్య
  • ఈ పథకాన్ని బలహీనపరచాలని పదేళ్లుగా చూస్తున్నారని ఆరోపణ
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పేరు మార్పుపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రెండు అంశాలు అసలే గిట్టవని ఆయన అన్నారు. ఒకటి రాహుల్ గాంధీ ఆలోచనలు, రెండోది పేదల హక్కులంటే ఆయనకు ఇష్టం ఉండదని విమర్శించారు. గాంధీజీ గ్రామ స్వరాజ్యం ఆలోచనలకు ప్రతిరూపమే గ్రామీణ ఉపాధి హామీ పథకమని, అలాంటి పేరు మార్పు సముచితం కాదని అభిప్రాయపడ్డారు.

ఈ పథకం పేరు మార్పు బిల్లు మహాత్మా గాంధీ ఆలోచనలకు అవమానమని ఆయన అభివర్ణించారు. 2014 నుంచి ఈ పథకాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని మోదీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఈ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ వస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు ఏకంగా ఆ పథకాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
Rahul Gandhi
Narendra Modi
MGNREGA
Mahatma Gandhi National Rural Employment Guarantee Act

More Telugu News