Venkatesh Iyer: వెంకటేశ్ అయ్యర్‌కు రూ. 7 కోట్లు.. డికాక్‌ను త‌క్కువ ధ‌ర‌కే ద‌క్కించుకున్న ముంబై

Venkatesh Iyer Bought by RCB for 7 Crores in IPL 2026 Auction
షార్ట్స్‌లో చూడండి
అబుదాబి వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారత ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. అతని కోసం రూ. 7 కోట్లు వెచ్చించి జట్టులోకి తీసుకుంది. గత మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వెంకటేశ్ అయ్యర్‌ను ఏకంగా రూ. 23.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ మినీ వేలానికి ముందు కేకేఆర్ అతడిని విడుదల చేయడంతో వెంకటేశ్ అయ్యర్ తిరిగి వేలం జాబితాలోకి వచ్చాడు. దీంతో ఆర్‌సీబీ అతడిపై ఆసక్తి చూపి పోటీపడి దక్కించుకుంది. గతంతో పోలిస్తే అతని ధర గణనీయంగా తగ్గడం గమనార్హం.

మరోవైపు, ఈ వేలంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారీ ధర పలుకుతాడని భావించిన దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్‌ను ముంబై ఇండియన్స్ కేవలం రూ. 1 కోటి బేస్ ప్రైస్‌కే సొంతం చేసుకుంది. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగను లక్నో జట్టు రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే, ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్, దక్షిణాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్‌లను ఢిల్లీ క్యాపిటల్స్ చెరో రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
Go Back to Shorts
Venkatesh Iyer
IPL 2026
Royal Challengers Bangalore
RCB
Quinton de Kock
Mumbai Indians
Wanindu Hasaranga
Lucknow
Ben Duckett
David Miller
Delhi Capitals
IPL Auction

More Telugu News