Kalvakuntla Kavitha: కవిత వర్సెస్ కూకట్‌పల్లి ఎమ్మెల్యే... ఐడీపీఎల్ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Kavitha vs Kukatpally MLA Telangana Govt Key Decision on IDPL Lands
  • కవిత భర్త అనిల్‌పై మాధవరం కృష్ణారావు భూకబ్జా ఆరోపణలు
  • పరస్పరం ఆరోపణలు చేసుకున్న కవిత, ఎమ్మెల్యే
  • వివాదం సంచలనంగా మారడంతో విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
ఐడీపీఎల్ భూముల వ్యవహారంపై ఇటీవల కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరస్పరం ఆరోపణలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగరంలోని ఐడీపీఎల్ భూములపై విచారణకు ఆదేశించింది. కూకట్‌పల్లిలోని సర్వే నెంబర్ 376లో ఉన్న రూ.4 వేల కోట్ల విలువైన భూములపై విచారణ చేపట్టాలని విజిలెన్స్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల కవిత భర్త అనిల్‌పై మాధవరం కృష్ణారావు భూకబ్జా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కవిత తీవ్రంగా స్పందించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

తన భర్తపై చేసిన ఆరోపణలకు సంబంధించి లీగల్ నోటీసులు పంపిస్తానని కవిత హెచ్చరించారు. కవిత వ్యాఖ్యలపై కృష్ణారావు స్పందిస్తూ లీగల్ నోటీసులు పంపించుకోవచ్చని అన్నారు. అనిల్ భూకబ్జాకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు, మీడియాకు, రాజకీయ పార్టీలకు అందజేస్తానని కృష్ణారావు తెలిపారు.
Kalvakuntla Kavitha
Kavitha
Kukatpally MLA
Madhavaram Krishna Rao
IDPL lands

More Telugu News