Pawan Kalyan: ‘ఓజీ’ డైరెక్టర్‌ సుజీత్‌కు పవన్ కల్యాణ్ ఖరీదైన గిఫ్ట్.. ఆనందంలో దర్శకుడు

Pawan Kalyan Gifts Luxury Car to OG Director Sujeeth
  • 'ఓజీ' విజయంతో దర్శకుడు సుజీత్‌కు పవన్ కానుక
  • లగ్జరీ రేంజ్ రోవర్ కారును బహుమతిగా అందజేత
  • ఎక్స్ వేదికగా ఆనందం పంచుకున్న దర్శకుడు సుజీత్
  • ఇది తాను అందుకున్న అత్యుత్తమ బహుమతి అని వెల్లడి
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ‘ఓజీ’ చిత్ర దర్శకుడు సుజీత్‌కు ఓ విలువైన బహుమతిని అందించి తన అభిమానాన్ని చాటుకున్నారు. ‘ఓజీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సందర్భంగా సుజీత్‌కు లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. ప్రముఖ ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన రేంజ్ రోవర్ కారును ఆయన సుజీత్‌కు బహూకరించారు. చాలా కాలం తర్వాత పవన్ నుంచి బ్లాక్‌బస్టర్ విజయం అందడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్న వేళ, ఈ వార్త వారి ఆనందాన్ని మరింత పెంచింది.

ఈ విషయాన్ని దర్శకుడు సుజీత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా స్వయంగా పంచుకున్నారు. పవన్ కల్యాణ్ అందించిన బహుమతి పట్ల తన సంతోషాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేశారు.

"నేను అందుకున్న బహుమతుల్లో ఇది అత్యుత్తమమైన‌ది. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా, కృతజ్ఞతతో నిండిపోయాను. నా అత్యంత ప్రియమైన ఓజీ, కల్యాణ్ గారి నుంచి లభించిన ఈ ప్రేమ, ప్రోత్సాహం నాకు అన్నిటికంటే ముఖ్యం. చిన్ననాటి నుంచి ఆయన అభిమానిగా మొదలై ఈ ప్రత్యేక క్షణం వరకు… ఇది నిజంగా అద్భుతం. జీవితంలో ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను" అంటూ సుజీత్ భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. 


Pawan Kalyan
OG movie
Sujeeth
Range Rover
Director Sujeeth
Telugu cinema
Blockbuster
Gift
AP Deputy CM
Pawan Kalyan gift

More Telugu News