Rakul Preet Singh: ప్లాస్టిక్ సర్జరీ వార్తలపై రకుల్ ప్రీత్ సింగ్ ఏమన్నారంటే..!

Rakul Preet Singh responds to plastic surgery accusations
  • సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పెట్టిన పోస్టును ఖండించిన నటి
  • వైద్యులమని చెప్పుకునే ఇలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త అంటూ హెచ్చరిక
  • ప్లాస్టిక్ సర్జరీని తాను తప్పుపట్టబోనని వెల్లడి
నటి రకుల్ ప్రీత్ సింగ్ తన శరీరాకృతి కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టుపై ఆమె స్పందించారు. వైద్యులమని చెప్పుకునే ఇలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అభిమానులను హెచ్చరించారు. తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాననే ప్రచారాన్ని రకుల్ ప్రీత్ సింగ్ ఖండించారు. తెలిసీతెలియకుండా కొంతమంది తమ పోస్టులతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని రకుల్ విమర్శించారు.

ఇలాంటి పోస్టులు పెట్టేవారిని చూస్తే భయం కలుగుతుందని చెప్పారు. పురాతన పద్ధతులతో పాటు తాను మోడ్రన్ సైన్స్ ను కూడా నమ్ముతానని, ఒకవేళ ఎవరైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే తాను తప్పుపట్టబోనని రకుల్ అన్నారు. వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గవచ్చని అందరూ తెలుసుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్ సూచించారు.
Rakul Preet Singh
Rakul Preet
plastic surgery
social media
body shaming
weight loss
exercise
fitness
actress

More Telugu News