Mehreen Pirzada: రెండేళ్లు మౌనంగా ఉన్నా.. ఇప్పుడు స్పందించక తప్పడం లేదు: మెహరీన్ పిర్జాదా

Mehreen Pirzada Reacts to Marriage Rumors
  • తన పెళ్లి జరిగిందంటూ వచ్చిన వార్తలపై స్పందించిన మెహరీన్
  • పరిచయం కూడా లేని వ్యక్తితో వివాహమైందని రాయడంపై ఆగ్రహం
  • వివాహం చేసుకునేటప్పుడు తానే స్వయంగా ప్రకటిస్తానని వెల్లడి
తనకు వివాహం జరిగిందంటూ తాజాగా ఓ మీడియా సంస్థలో వచ్చిన కథనంపై ప్రముఖ నటి మెహరీన్ కౌర్ పిర్జాదా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు అసలు పరిచయమే లేని వ్యక్తితో పెళ్లి జరిగిందని వార్తలు రాయడంపై ఆమె మండిపడ్డారు. గత రెండేళ్లుగా ఇలాంటి విషయాలపై మౌనంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు స్పందించక తప్పడం లేదని అన్నారు.

ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. "ఓ వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు వార్త రాశారు. అతడితో నాకు కనీసం పరిచయం కూడా లేదు. నేను ఎవరినీ వివాహం చేసుకోలేదు. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయాన్ని నేనే స్వయంగా ప్రపంచానికి తెలియజేస్తాను. దయచేసి నన్ను నమ్మండి" అని పేర్కొన్నారు. తన పెళ్లి గురించి ఇలాంటి నిరాధార వదంతులు వ్యాప్తి చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

గతంలో మెహరీన్‌కు హర్యానాకు చెందిన భవ్యా బిష్ణోయ్‌తో నిశ్చితార్థం జరిగినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ వివాహం రద్దయిన సంగతి తెలిసిందే. ఇక తన కెరీర్‌లో వచ్చిన గ్యాప్‌పై కూడా ఆమె స్పందించారు. 2022లో వచ్చిన 'ఎఫ్ 3' తర్వాత 'స్పార్క్' అనే తెలుగు చిత్రంలో నటించారు. మధ్యలో 'సుల్తాన్ ఆఫ్ దిల్లీ' అనే వెబ్‌సిరీస్‌ కోసం ఎక్కువ సమయం కేటాయించడం వల్లే గ్యాప్ వచ్చిందని, కావాలని విరామం తీసుకోలేదని వివరించారు. ప్రస్తుతం ఆమె కన్నడలో ఒక చిత్రంలో నటిస్తున్నారు.  
Mehreen Pirzada
Mehreen Kaur Pirzada
actress
marriage rumors
Bhavy Bishnoi
engagement cancelled
F3 movie
Spark movie
Sultan of Delhi web series
Telugu cinema

More Telugu News