14 గంటల పని.. 28 ఆర్డర్లు.. బ్లింకిట్ ఏజెంట్ సంపాదన ఇంతే!
- రూ. 762 సంపాదించిన బ్లింకిట్ డెలివరీ ఏజెంట్
- డెలివరీ ఏజెంట్లకు టిప్ ఇవ్వాలంటూ నెటిజన్ల సూచన
- గిగ్ ఎకానమీ మోడల్‌పై సోషల్ మీడియాలో విమర్శలు
- మరో రోజు 11 గంటల్లో రూ. 1202 సంపాదించిన ఏజెంట్
ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లు మన ఇంటికే నిత్యావసరాలను నిమిషాల్లో అందిస్తూ మన జీవితాన్ని సులభతరం చేస్తున్నాయి. అయితే, ఆ వేగానికి వెనుక ఉన్న డెలివరీ ఏజెంట్ల కష్టం, వారి సంపాదన ఎంత అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ తన రోజువారీ సంపాదనను వివరిస్తూ పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, గిగ్ వర్కర్ల పరిస్థితులపై చర్చ లేవనెత్తుతున్నారు.
వివరాల్లోకి వెళితే, @thapliyaljivlogs అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తాను ఒక రోజులో చేసిన డెలివరీల వివరాలను పంచుకున్నాడు. ఆ రోజు అతను 14 గంటలకు పైగా పనిచేసి, 28 ఆర్డర్లు డెలివరీ చేయగా.. ఇన్సెంటివ్‌తో కలిపి అతడికి అందిన మొత్తం కేవలం రూ. 762 మాత్రమే. తన ఫోన్‌లోని యాప్ స్క్రీన్‌గ్రాబ్స్‌ను చూపిస్తూ అతను ఈ వివరాలను వెల్లడించాడు. "బ్లింకిట్ చాలా తక్కువ డబ్బు ఇస్తోంది" అని అతడు వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. గంటల తరబడి కష్టపడినా సరైన ప్రతిఫలం దక్కడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. "డెలివరీ ఏజెంట్లకు తప్పకుండా టిప్ ఇవ్వండి. మనకు రూ. 30 పెద్ద మొత్తం కాకపోవచ్చు, కానీ వారికి అది ఎంతో సహాయపడుతుంది" అని ఒకరు కామెంట్ చేయగా, మరికొందరు కంపెనీల విధానాలను తప్పుబట్టారు.
అయితే, మరో వీడియోలో అదే ఏజెంట్, ఇంకో రోజు 11 గంటల్లో 32 ఆర్డర్లు డెలివరీ చేసి రూ. 1202 సంపాదించినట్లు చూపించాడు. దీన్ని బట్టి ఆర్డర్ల లభ్యత, ఇతర అంశాలపై వారి సంపాదన ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.