IPL 2026 Mini Auction: నేడే ఐపీఎల్ మినీ వేలం... పది ఫ్రాంచైజీల వ‌ద్ద మిగిలిన పర్స్ ఇలా..!

IPL 2026 Mini Auction Today Team Purse Details
  • అబుదాబిలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం
  • వేలంలో 369 మంది ఆటగాళ్లు.. 77 స్లాట్లు ఖాళీ
  • అత్యధికంగా కోల్‌కతా వద్ద రూ.64.3 కోట్ల పర్స్
ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఆటగాళ్ల మినీ వేలానికి రంగం సిద్ధమైంది. అబుదాబిలోని ఎతిహాద్ ఎరీనా వేదికగా ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ వేలం ప్రారంభం కానుంది. మొత్తం పది ఫ్రాంచైజీలు తమ జట్లలోని ఖాళీలను భర్తీ చేసుకునేందుకు పోటీపడనున్నాయి.

ఈసారి వేలం బరిలో మొత్తం 369 మంది ఆటగాళ్లు ఉన్నారు. కామెరూన్ గ్రీన్, వెంకటేశ్ అయ్యర్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి స్టార్ ప్లేయర్లపై ఫ్రాంచైజీలు భారీ మొత్తాలు వెచ్చించే అవకాశం ఉందని విశ్లేషకుల అంచ‌నా. ఇక‌, మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధికంగా రూ.64.3 కోట్ల పర్స్‌తో వేలంలోకి అడుగుపెడుతోంది. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.43.40 కోట్లు ఉన్నాయి.

పది ఫ్రాంచైజీలు కలిపి మొత్తం 77 స్లాట్లను భర్తీ చేయాల్సి ఉండగా, వాటి వద్ద రూ.237.55 కోట్లు అందుబాటులో ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 స్లాట్లను (ఇద్దరు విదేశీ ఆటగాళ్లతో సహా) భర్తీ చేయాల్సి ఉండగా, వారి వద్ద రూ.25.50 కోట్ల పర్స్ ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ అత్యల్పంగా కేవలం రూ.2.75 కోట్ల పర్స్‌తో వేలంలో పాల్గొననుండటం గమనార్హం.

ప్రతి జట్టుకు మిగిలిన పర్స్..
కోల్‌కతా నైట్ రైడర్స్ - రూ. 64.30
చెన్నై సూపర్ కింగ్స్ - రూ. 43.40
సన్‌రైజర్స్ హైదరాబాద్ - రూ. 25.50
లక్నో సూపర్ జెయింట్స్ - రూ. 22.95
ఢిల్లీ క్యాపిటల్స్ - రూ. 21.80
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - రూ. 16.40
రాజస్థాన్ రాయల్స్ - రూ. 16.05
గుజరాత్ టైటాన్స్ - రూ. 12.90
పంజాబ్ కింగ్స్ - రూ. 11.50
ముంబై ఇండియన్స్ - రూ. 2.75


పది జ‌ట్ల ఖాళీ స్లాట్స్ వివ‌రాలు..
చెన్నై సూప‌ర్ కింగ్స్: 9 (4 ఓవర్సీస్ ఆట‌గాళ్ల‌కు ఛాన్స్)
ఢిల్లీ క్యాపిటల్స్: 8 (5 ఓవర్సీస్)
గుజరాత్ టైటాన్స్: 5 (4 ఓవ‌ర్సీస్‌)
కోల్‌కతా నైట్ రైడర్స్: 13 (6 ఓవ‌ర్సీస్‌)
లక్నో సూపర్ జెయింట్స్: 6 (4 ఓవర్సీస్)
ముంబై ఇండియన్స్: 5 (1 ఓవ‌ర్సీస్‌)
పంజాబ్ కింగ్స్: 4 (2 ఓవర్సీస్)
రాజస్థాన్ రాయల్స్: 9 (1 ఓవ‌ర్సీస్‌)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 8 (2 ఓవ‌ర్సీస్‌)
సన్‌రైజర్స్ హైదరాబాద్: 10 (2 ఓవ‌ర్సీస్‌)
 

ఈ మినీ వేలంలో ఏ ఆటగాడు అత్యధిక ధర పలుకుతాడు, ఏ జట్టు తెలివైన కొనుగోళ్లతో బలపడుతుంది అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 
IPL 2026 Mini Auction
Indian Premier League
Cameron Green
Venkatesh Iyer
Liam Livingstone
Kolkata Knight Riders
Chennai Super Kings
Sunrisers Hyderabad
IPL Purse Value

More Telugu News