IPL: ఐపీఎల్-పీఎస్ఎల్ ఢీ.. ఒకే రోజు ప్రారంభం కానున్న రెండు మెగా లీగ్‌లు!
- 2026లోనూ ఐపీఎల్, పీఎస్ఎల్ మధ్య పోటీ ఖాయం
- రెండు లీగ్‌లు మార్చి 26న ఒకే రోజు ప్రారంభం
- మే 31న ఐపీఎల్ ఫైనల్, మే 3న పీఎస్ఎల్ ఫైనల్
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో కుతూహలంతో ఎదురుచూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2026 సీజన్లు ఒకే రోజున ప్రారంభం కానున్నాయి. ‘క్రిక్‌బజ్’ కథనం ప్రకారం.. రెండు లీగ్‌లు మార్చి 26, 2026 (గురువారం) నుంచి మొదలవుతాయని ఆయా బోర్డులు ఫ్రాంచైజీలకు తెలియజేశాయి. వరుసగా రెండో ఏడాది కూడా ఈ రెండు ప్రముఖ టీ20 లీగ్‌లు ఒకే సమయంలో జరగనుండటం గమనార్హం.
ఐపీఎల్ సీఈవో హేమంగ్ అమీన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐపీఎల్ మార్చి 26న ప్రారంభమై, మే 31న (ఆదివారం) ఫైనల్‌తో ముగుస్తుంది. మరోవైపు, పీఎస్ఎల్ కూడా అదే తేదీన మొదలైనప్పటికీ, అది కేవలం 38 రోజుల పాటే జరిగి మే 3న (శనివారం) ముగుస్తుంది. 10 జట్లతో 74 మ్యాచ్‌లతో ఐపీఎల్ సుదీర్ఘంగా సాగనుండగా, పీఎస్ఎల్ ఈసారి 6 జట్ల నుంచి 8 జట్లకు విస్తరించనుంది.