MGNREGA: పేరు మార్పు, నిబంధనల మార్పు.. ఉపాధి హామీకి కేంద్రం సరికొత్త రూపు
- ఉపాధి హామీ చట్టం స్థానంలో వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ మిషన్
- గ్రామీణ కుటుంబాలకు పని దినాలు 100 నుంచి 125కి పెంపు
- వేతనాల చెల్లింపులో రాష్ట్రాలకు 40 శాతం వాటా తప్పనిసరి
- ఏడాదిలో 60 రోజుల పాటు పనులు నిలిపివేసే అధికారం రాష్ట్రాలకు
- వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా పథకం రూపకల్పన
దేశ గ్రామీణ ఉపాధి వ్యవస్థలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో సరికొత్త చట్టాన్ని తీసుకురానుంది. "వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (VB–G RAM G) బిల్లు, 2025" పేరుతో రూపొందించిన ఈ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ఉపాధి, అభివృద్ధి కార్యక్రమాలను తీర్చిదిద్దడమే ఈ కొత్త చట్టం ముఖ్య ఉద్దేశం.
పాత చట్టం స్థానంలో కొత్త వ్యవస్థ ఎందుకు?
ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడినప్పటికీ, దాని అమలులో అనేక నిర్మాణాత్మక లోపాలు ఉన్నాయని కేంద్రం భావిస్తోంది. నిధుల దుర్వినియోగం, డిజిటల్ హాజరును పక్కదారి పట్టించడం, చేపట్టిన పనులకు, పెట్టిన ఖర్చుకు పొంతన లేకపోవడం వంటి సమస్యలు వ్యవస్థను బలహీనపరిచాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పాత చట్టాన్ని రద్దు చేసి, మరింత ఆధునిక, పారదర్శక విధానాలతో కూడిన కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందని వివరించింది.
'వీబీ-జి రామ్ జి' బిల్లులో కీలక మార్పులు ఇవే:
పని దినాల పెంపు: ప్రస్తుత ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని దినాలు కల్పిస్తుండగా, కొత్త బిల్లులో దీనిని 125 రోజులకు పెంచారు. నైపుణ్యం అవసరం లేని పనులు చేయడానికి ముందుకొచ్చే వయోజన సభ్యులకు ఈ గ్యారెంటీ వర్తిస్తుంది.
నిధుల కేటాయింపులో మార్పు: ప్రస్తుతం అమల్లో ఉన్న ఉపాధి హామీ చట్టం (MGNREGA) ప్రకారం, నైపుణ్యం లేని కార్మికుల వేతనాల ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. పనులకు అవసరమైన సామగ్రి ఖర్చులో నాలుగింట మూడు వంతులు (75 శాతం), నైపుణ్యం కలిగిన, పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికుల వేతనాల్లో నాలుగింట మూడు వంతుల వాటాను కూడా కేంద్రమే అందిస్తోంది. అయితే, ప్రతిపాదిత కొత్త బిల్లు ఈ నిధుల పంపిణీ విధానంలో కీలక మార్పులు తీసుకురానుంది. దీని ప్రకారం, సాధారణ రాష్ట్రాల్లో కూలీల వేతనాల చెల్లింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 60:40 నిష్పత్తిలో ఉంటుంది. ప్రత్యేక కేటగిరీ ప్రాంతాలకు ఇది 90:10గా ఉంటుంది. నిరుద్యోగ భృతిని మాత్రం రాష్ట్రాలే చెల్లించాల్సి ఉంటుంది
పనులు నిలిపివేసే అధికారం: వ్యవసాయ పనులు ఎక్కువగా ఉండే కాలంలో కూలీల కొరతను నివారించేందుకు రాష్ట్రాలకు కొత్త అధికారాన్ని కల్పించారు. దీని ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా 60 రోజుల పాటు పనులను నిలిపివేయవచ్చు. ఈ 60 రోజులు నిరంతరాయంగా ఉండాల్సిన అవసరం లేదు. మిగిలిన రోజుల్లో కార్మికులకు పూర్తి 125 రోజుల పని కల్పించాల్సి ఉంటుంది.
వేతనాల చెల్లింపు: కూలీలకు ప్రతి వారం వేతనాలు చెల్లించాలని, గరిష్ఠంగా పదిహేను రోజులకు మించి ఆలస్యం చేయరాదని బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు.
పనుల వర్గీకరణ: నీటి భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధికి సంబంధించిన నిర్మాణాలు, వాతావరణ మార్పుల తట్టుకునే పనులు అనే నాలుగు ప్రధాన రంగాలపై దృష్టి సారించి పనులను కేటాయిస్తారు.
పారదర్శకతకు పెద్దపీట
ఈ కొత్త వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత మోసాల గుర్తింపు, జీపీఎస్, మొబైల్ ఆధారిత పర్యవేక్షణ, రియల్-టైమ్ డాష్‌బోర్డులు, మెరుగైన సోషల్ ఆడిట్‌లు వంటివి అమలు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పర్యవేక్షణ కమిటీలు కూడా ఏర్పాటు కానున్నాయి.
వివిధ వర్గాలకు కలిగే ప్రయోజనాలు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు:
ఈ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పాదక ఆస్తుల కల్పన, నీటి భద్రత, మౌలిక వసతుల కల్పన పెరుగుతుంది. తద్వారా గ్రామీణుల ఆదాయాలు పెరిగి, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వలసలు తగ్గుముఖం పడతాయి.
రైతులకు:
విత్తనాలు వేసే, పంట కోతల సమయంలో 60 రోజుల పాటు పనులకు విరామం ఇవ్వడం వల్ల వ్యవసాయ పనులకు కూలీల కొరత ఉండదు. నీటిపారుదల పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల భూగర్భ జలాలు పెరిగి, ఎక్కువ కాలం పంటలు పండించే అవకాశం కలుగుతుంది.
కూలీలకు:
పనిదినాలు 125కి పెరగడంతో కూలీల వార్షిక ఆదాయం పెరుగుతుంది. ప్రతి వారం వేతనాలు చెల్లించడం, గరిష్ఠంగా పదిహేను రోజుల్లోపు చెల్లింపులు పూర్తిచేయాలనే నిబంధన వారికి ఆర్థిక భరోసా ఇస్తుంది. పని దొరకని పక్షంలో నిరుద్యోగ భృతి పొందే హక్కు యథాతథంగా కొనసాగుతుంది.
మొత్తంమీద, ఈ బిల్లు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉత్పాదక ఆస్తులను సృష్టించడం, వలసలను తగ్గించడం వంటి లక్ష్యాలతో రూపుదిద్దుకుంది. రైతులు, కూలీలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమగ్ర ప్రయోజనాలు చేకూర్చేలా ఈ చట్టాన్ని తీర్చిదిద్దినట్లు కేంద్రం పేర్కొంటోంది.
పాత చట్టం స్థానంలో కొత్త వ్యవస్థ ఎందుకు?ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడినప్పటికీ, దాని అమలులో అనేక నిర్మాణాత్మక లోపాలు ఉన్నాయని కేంద్రం భావిస్తోంది. నిధుల దుర్వినియోగం, డిజిటల్ హాజరును పక్కదారి పట్టించడం, చేపట్టిన పనులకు, పెట్టిన ఖర్చుకు పొంతన లేకపోవడం వంటి సమస్యలు వ్యవస్థను బలహీనపరిచాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పాత చట్టాన్ని రద్దు చేసి, మరింత ఆధునిక, పారదర్శక విధానాలతో కూడిన కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందని వివరించింది.