Axar Patel: టీమిండియాకు ఎదురుదెబ్బ... దక్షిణాఫ్రికాతో మిగతా మ్యాచ్‌లకు అక్షర్ పటేల్ దూరం

Axar Patel Out Of South Africa T20 Series
  • మూడో మ్యాచ్‌లోనూ ఆడని అక్షర్ పటేల్
  • సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచ్‌లు పూర్తి
  • అక్షర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌కు చోటు
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అనారోగ్యం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌ల నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో షాబాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అక్షర్ పటేల్ మూడవ మ్యాచ్‌లోనూ ఆడలేదు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి... ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌లలో భారత్ రెండు మ్యాచ్‌లలో, దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌లో విజయం సాధించాయి. భారత్ మొదటి, మూడవ మ్యాచ్‌లలో గెలుపొందగా, రెండవ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఆడనున్న 31 ఏళ్ల షాబాజ్ అహ్మద్, భారత్ తరఫున రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడాడు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాణించిన కారణంగా టీమిండియాలో అక్షర్ స్థానంలో అతనికి అవకాశం లభించింది.
Axar Patel
India vs South Africa
India T20 series
Shahbaz Ahmed
BCCI
India Cricket Team

More Telugu News