IPL Auction 2026: ఐపీఎల్ వేలంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్లు... ఈ ఐదుగురిపై ఓ లుక్కేయొచ్చు!

IPL Auction 2026 Uncapped Players to Watch
  • ఐపీఎల్ 2026 వేలానికి సర్వం సిద్ధం
  • అన్‌క్యాప్డ్ దేశీయ ఆటగాళ్లపై ఫ్రాంచైజీల దృష్టి
  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చాటిన యంగ్ ప్లేయర్స్
  • ఐదుగురు కీలక ఆటగాళ్లపై కోట్లు కురిసే అవకాశం
  • వీరందరి కనీస ధర రూ. 30 లక్షలుగా నిర్ణయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ కోసం అబుదాబిలో రేపు (డిసెంబరు 16) జరగనున్న వేలానికి రంగం సిద్ధమైంది. ఈసారి కూడా అందరి దృష్టి అన్‌క్యాప్డ్ దేశీయ ఆటగాళ్లపైనే ఉంది. తక్కువ ధరలో లభించే ఈ యువ ప్రతిభావంతుల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, వివిధ రాష్ట్రాల టీ20 లీగ్‌లలో రాణించిన ఆటగాళ్లను గుర్తించేందుకు పది జట్ల స్కౌట్లు, కోచ్‌లు గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా పర్యటించారు.

పరిమితమైన పర్సులతో చాలా స్లాట్‌లను భర్తీ చేసుకోవాల్సి ఉండటంతో, అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు భారీ డిమాండ్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రముఖ వార్తా సంస్థ ఐఏఎన్ఎస్ కథనం ప్రకారం, ఈసారి వేలంలో ఐదుగురు యువ ఆటగాళ్లు భారీ ధర పలికే అవకాశం ఉంది. వీరందరి కనీస ధర రూ. 30 లక్షలుగా ఉంది.

ఆ ఐదుగురు వీరే

1. ప్రశాంత్ వీర్ (ఉత్తరప్రదేశ్): రవీంద్ర జడేజాతో పోల్చబడుతున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండర్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 169 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడమే కాక, 9 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ సహా పలు జట్ల ట్రయల్స్‌లో పాల్గొన్నాడు.

2. ఆకిబ్ నబీ దార్ (జమ్మూ & కశ్మీర్): దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ఈ సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్, రంజీ ట్రోఫీలో ఐదు మ్యాచుల్లోనే 29 వికెట్లు తీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 15 వికెట్లతో సత్తా చాటాడు.

3. అశోక్ శర్మ (రాజస్థాన్): గంటకు 140 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసే ఈ ఫాస్ట్ బౌలర్, ప్రస్తుత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 9 మ్యాచ్ లలో 20 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. గతంలో రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ జట్లలో ఉన్నా ఆడే అవకాశం రాలేదు.

4. కార్తీక్ శర్మ (రాజస్థాన్): కేవలం 19 ఏళ్ల వయసులోనే భారీ సిక్సర్లతో లోయర్ ఆర్డర్‌లో ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో 118 స్ట్రైక్ రేట్‌తో 445 పరుగులు చేశాడు. సీఎస్కే ట్రయల్స్‌లోనూ కనిపించాడు.

5. తేజస్వి సింగ్ దహియా (ఢిల్లీ): వికెట్ కీపర్ బ్యాటర్ అయిన తేజస్వి, ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో 190 స్ట్రైక్ రేట్‌తో దుమ్ము రేపాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కర్ణాటకపై 19 బంతుల్లో 53 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

వీరితో పాటు యశ్ ధుల్, రవి కుమార్, రాజ్ లింబానీ వంటి అనేక మంది ఇతర యువ ఆటగాళ్లు కూడా ఫ్రాంచైజీల రాడార్‌లో ఉన్నారు.
IPL Auction 2026
Prashant Veer
Syed Mushtaq Ali Trophy
Akib Nabi Dar
Ashok Sharma
Kartik Sharma
Tejaswi Singh Dahiya
Uncapped Players
Indian Premier League
Cricket Auction

More Telugu News