New Zealand Visa: భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో సర్వీసు ఫీజు పెంపు: న్యూజిలాండ్

New Zealand Visa Service Fee Increased in India and 25 Countries
  • జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో అమల్లోకి పెంపు నిర్ణయం
  • నిర్వహణపరమైన వ్యయాలు, ద్రవ్యోల్భణం కారణంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
  • వెల్లడించిన న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంట్
భారత్ సహా 25 దేశాల్లో వీసా దరఖాస్తు కేంద్రాల్లో వసూలు చేసే సర్వీసు ఫీజును పెంచుతున్నట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. ఈ పెంపు జనవరి 1 నుంచి కొన్ని కేంద్రాల్లో అమల్లోకి రానుంది. నిర్వహణపరమైన వ్యయాలు, ద్రవ్యోల్భణం కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. న్యూజిలాండ్ వీసా కోసం ఇకముందు దరఖాస్తు చేసుకునేవారు ఈ మార్పును గమనించాలని సూచించారు.

భారత్‌తో పాటు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్థాన్, శ్రీలంక, సింగపూర్, జపాన్ తదితర 25 దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీసా దరఖాస్తు ఫీజుకు అదనంగా వీసా అప్లికేషన్ కేంద్రాలు వసూలు చేసే ఫీజు ఉంటుందని ఆ దేశ ఇమ్మిగ్రేషన్ డిపార్టుమెంట్ పేర్కొంది. ఇటీవల చేపట్టిన సిస్టమ్ అప్‌గ్రేడ్‌ల కారణంగా ఫీజు పెంపు చేపట్టవలసి వచ్చిందని తెలిపింది. దరఖాస్తులు సమర్పించే ముందు, ఫీజు వివరాలను సరిచూసుకోవాలని సూచించింది.
New Zealand Visa
New Zealand
Visa Application Fee
Visa Fee Hike
Immigration Department

More Telugu News