SP Balu: రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

SP Balu Statue Unveiled at Ravindra Bharathi
  • విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • కార్యక్రమానికి హాజరైన బండారు దత్తాత్రేయ, శ్రీధర్ బాబు, రామచందర్ రావు
  • తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించిన 7.2 అడుగుల విగ్రహం
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తదితరులు హాజరయ్యారు.

7.2 అడుగుల ఎత్తు ఉన్న బాలు కాంస్య విగ్రహాన్ని తూర్పు గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించారు. విగ్రహావిష్కరణలో భాగంగా రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 పాటలతో ఈరోజు సాయంత్రం 50 మందితో సంగీత విభావరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

రవీంద్ర భారతిలో బాలు విగ్రహం ఏర్పాటుపై ప్రముఖ గాయని, ఆయన సోదరి ఎస్పీ శైలజ స్పందించారు. రవీంద్ర భారతిలో తన విగ్రహం పెట్టాలన్నది బాలసుబ్రహ్మణ్యం చివరి కోరిక అని వెల్లడించారు. తన విగ్రహాన్ని పెట్టాలని ఆర్కెస్ట్రా వారి వద్ద బాలు వ్యక్తం చేయగా, వారు అతనిని వారించారని అన్నారు. కానీ ఇప్పుడు ఆయన కోరిక నెరవేరిందని ఆమె అన్నారు. తెలుగును మరిచిపోవద్దని, క్రమశిక్షణగా ఉండాలని ఎస్పీ బాలు ఎప్పుడూ చెప్పేవారని అన్నారు.
SP Balu
SP Balasubrahmanyam
Ravindra Bharathi
Venkiah Naidu
SP Sailaja
Telangana

More Telugu News