Tilak Varma: కోహ్లీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన తెలుగు తేజం తిలక్ వర్మ

Tilak Varma Sets New T20 Record Beating Virat Kohli
  • టీ20 ఛేజింగ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించిన తిలక్ వర్మ
  • అత్యధిక బ్యాటింగ్ సగటుతో విరాట్ కోహ్లీని అధిగమించిన తెలుగు ప్లేయ‌ర్‌
  • టెస్టు హోదా దేశాల ఆటగాళ్లలో అగ్రస్థానంలో నిలిచిన తిల‌క్
టీమిండియా యువ సంచలనం, తెలుగు తేజం తిలక్ వర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. లక్ష్య ఛేదనలో అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన ఆటగాడిగా అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఇన్నాళ్లుగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును తిలక్ వర్మ బద్దలు కొట్టడం విశేషం.

ప్రస్తుతం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తిలక్ వర్మ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఛేజింగ్ సమయంలో టెస్టు హోదా కలిగిన దేశాల తరఫున ఆడి కనీసం 500 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో తిలక్ ఇప్పుడు అత్యుత్తమ సగటుతో నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు.

ఈ సిరీస్‌లో భాగంగా కటక్ వేదికగా జరిగిన తొలి టీ20లో తిలక్ వర్మ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 32 బంతుల్లో 26 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో 34 బంతుల్లో 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నిలకడైన ప్రదర్శనతో కోహ్లీ వంటి దిగ్గజాన్ని అధిగమించి, ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

టీ20 ఫార్మాట్లో ల‌క్ష్య‌ ఛేదనలో అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్లు వీరే..

తిలక్‌ వర్మ (భారత్)- సగటు (68.0) 

విరాట్ కోహ్లీ (భారత్)- 67.1 

ఎంఎస్ ధోనీ (భారత్)- 47.71 

జేపీ డుమిని (దక్షిణాఫ్రికా)- 45.55 

సంగక్కర (శ్రీలంక)- 44.93
Tilak Varma
Virat Kohli
India vs South Africa
T20 Record
Cricket
MS Dhoni
Batting Average
Telugu Player
Kataka T20
JP Duminy

More Telugu News