Duvvada Srinivas: మొయినాబాద్ ఫాంహౌస్ పార్టీ.. దివ్వెల మాధురి బంధువుకు నోటీసులు

Duvvada Srinivas Moinabad Farmhouse Party Notices to Madhuris Relative
  • మొయినాబాద్ ఫాంహౌస్ పార్టీ వ్యవహారంలో కేసు నమోదు
  • మాధురి బంధువు పార్థసారథికి నోటీసులు జారీ
  • కేసు కోర్టు విచారణకు వచ్చినప్పుడు హాజరు కావాలని పోలీసుల ఆదేశం
వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పాల్గొన్న మొయినాబాద్ ఫాంహౌస్ పార్టీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పార్టీ నిర్వాహకుడికి నోటీసులు జారీ చేశారు. అయితే, ఈ కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ పేరు లేకపోవడం గమనార్హం.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో దివ్వెల మాధురి బంధువు పార్థసారథి పుట్టినరోజు వేడుకను అనుమతి లేకుండా నిర్వహించారు. అదే రోజున దివ్వెల మాధురి పుట్టినరోజు కూడా ఉండడంతో, ఘనంగా వేడుకలు జరపాలని నిర్ణయించారు. ఈ పార్టీకి దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురితో పాటు మొత్తం 26 మంది హాజరయ్యారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు ఆ ఫాంహౌస్‌పై దాడి చేశారు. అక్కడి నుంచి 10 విదేశీ మద్యం బాటిళ్లు, ఐదు హుక్కాలను స్వాధీనం చేసుకుని, దువ్వాడ, మాధురి, ఆమె బంధువు పార్థసారథిని విచారించారు.

తాజాగా ఈ ఘటనపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈవెంట్‌ను నిర్వహించింది మాధురి బంధువైన అమలాపురం వాసి పార్థసారథిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా విదేశీ మద్యం, హుక్కా వినియోగించినందుకు కేసు నమోదు చేసినట్లు తెలిపి, కోర్టు విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. 
Duvvada Srinivas
Moinabad farmhouse party
Divvela Madhuri
Telangana police
Rajendranagar special operation team
Parthasarathi
YSRCP
Liquor
Hookah

More Telugu News