Ranveer Singh: ధురంధర్' హిట్‌తో ఫామ్‌లోకి రణవీర్... దీపికా ఇష్యూపై పాత వీడియో వైరల్

Ranveer Singh Dhurandhar Hit Old Video Surfaces Related to Deepika Padukones Working Hours
  • వర్కింగ్ అవర్స్ వ్యాఖ్యలపై రణవీర్ పాత వీడియో వైరల్
  • 2022 నాటి వీడియోను ఇప్పుడు ట్రెండ్ చేస్తున్న నెటిజన్లు
  • బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన రణవీర్ సింగ్ 'ధురంధర్' 
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ 'ధురంధర్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ నెల 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ. 350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, బాలీవుడ్‌లో 'పుష్ప 2' పేరిట ఉన్న కొన్ని రికార్డులను సైతం అధిగమించింది.  

గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రణవీర్‌కు ఈ సినిమా కెరీర్‌లో పెద్ద రిలీఫ్ ఇచ్చింది. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం, బాలీవుడ్‌కు ఈ ఏడాది చివర్లో వచ్చిన ఒక సర్‌ప్రైజ్ హిట్‌గా నిలిచింది.

ఇదిలా ఉండగా, 'ధురంధర్' విజయాన్ని ఆస్వాదిస్తున్న రణవీర్‌కు సంబంధించి ఓ పాత వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య, నటి దీపికా పదుకొణె తాను రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రణవీర్ గతంలో పనివేళల గురించి మాట్లాడిన వీడియోను దీపికాకు కౌంటర్‌గా కొందరు వైరల్ చేస్తున్నారు.

"8 గంటల షిఫ్ట్‌లో నేను కొన్నిసార్లు 10-12 గంటలు పనిచేస్తాను. దాంతో తోటి నటీనటులు కూడా నాతో పాటు ఉండాల్సి వస్తుంది. వారి ఇతర సినిమాల షెడ్యూల్స్ దెబ్బతింటాయి. అనుకున్న షూట్ 8 గంటల్లో పూర్తి కాకపోతే, మరికొంత సమయం పనిచేయడంలో తప్పేముంది?" అని రణవీర్ ఆ వీడియోలో అన్నారు. అయితే, ఈ వీడియో ఇప్పటిది కాదు. 2022లో ఓ ఇంటర్వ్యూలో రణవీర్ మాట్లాడిన సందర్భంలోనిది. అప్పటి వీడియోను ఇప్పుడు దీపికా వ్యాఖ్యలకు ముడిపెడుతూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. 
Ranveer Singh
Dhurandhar movie
Deepika Padukone
Bollywood
Box office collections
Viral video
Movie success
Actor controversy
Film industry
Working hours

More Telugu News