Sachin Tendulkar: క్రికెట్ దేవుడితో ఫుట్‌బాల్ మాంత్రికుడు.. '10/10 డే' అన్న సచిన్!

Sachin Tendulkar and Lionel Messi Meet in Mumbai
  • వాంఖడే స్టేడియంలో లియోనెల్ మెస్సీతో సచిన్ భేటీ
  • ఇద్దరు క్రీడా దిగ్గజాలు ఒకేచోట కలవడంపై అభిమానుల హర్షం
  • మెస్సీకి తన నంబర్ 10 జెర్సీని బహూకరించిన లిటిల్ మాస్ట‌ర్ 
  • ఈ రోజు '10/10 డే' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన టెండూల్కర్
క్రీడా ప్రపంచంలోని దిగ్గజాలైన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, ఫుట్‌బాల్ మాంత్రికుడు లియోనెల్ మెస్సీ ఒకేచోట కలిశారు. నిన్న‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో వీరిద్దరి అరుదైన భేటీ జరిగింది. ఈ కలయిక క్రీడాభిమానులకు కనుల పండుగ చేసింది. దేశ క్రీడా చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. మెస్సీతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. "ఈ రోజు నిజంగా 10/10 డే, లియో మెస్సీ" అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది.

సచిన్ తన పోస్ట్‌లో '10/10' అని పేర్కొనడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. క్రికెట్‌లో సచిన్, ఫుట్‌బాల్‌లో మెస్సీ ఇద్దరూ తమ జట్ల కోసం 10వ నంబర్ జెర్సీని ధరించడం విశేషం. ఈ భేటీ సందర్భంగా సచిన్ తన 10వ నంబర్ టీమిండియా జెర్సీని మెస్సీకి బహుమతిగా అందించారు. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్‌లో కనపడటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. క్రికెట్, ఫుట్‌బాల్ మధ్య అభిమానుల్లో ఉండే పోటీ వాతావరణం పక్కకుపోయి, ఇద్దరు గొప్ప ఆటగాళ్ల కలయికను అందరూ ఆస్వాదించారు.
Sachin Tendulkar
Lionel Messi
Sachin Messi meet
Mumbai Wankhede Stadium
Football legend
Cricket legend
10 number jersey
India sports news
Sports icons
Sachin Tendulkar jersey

More Telugu News