Akhanda 2: బాలయ్య శివతాండవం.. థియేటర్లో మహిళకు పూనకం.. ఇదిగో వీడియో!

Balakrishna Akhanda 2 Moviegoer Experiences Trance in Theater Viral Video
  • 'అఖండ 2' క్లైమాక్స్‌లో బాలయ్య శివతాండవాన్ని చూసి తీవ్ర భావోద్వేగం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహిళ వీడియో
  • సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన
  • ఆధ్యాత్మిక అంశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్న వైనం
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'అఖండ 2' చిత్రం థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమాలోని ఆధ్యాత్మిక అంశాలు, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయంటే.. ఓ థియేటర్లో సినిమా చూస్తున్న మహిళ పూనకం వచ్చినట్టు ఊగిపోయిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

సినిమా క్లైమాక్స్‌లో బాలకృష్ణ శివతాండవం చేసే సన్నివేశం వస్తున్నప్పుడు ఓ ప్రేక్షురాలు ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె పూనకంలో ఊగిపోతూ కనిపించారు. వెంటనే పక్కనే ఉన్న ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఆమెను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించడం వీడియోలో రికార్డయింది. దీనిని చూసిన థియేటర్‌లోని మిగతా ప్రేక్షకులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే దానిపై స్పష్టత లేనప్పటికీ, వీడియో మాత్రం నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'అఖండ 2', మొదటి భాగం 'అఖండ'కు మించిన విజయాన్ని అందుకుంటోంది. బాలయ్య అఘోర పాత్ర, శక్తిమంతమైన సంభాషణలు, తమన్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా శివ స్తోత్రాలతో కూడిన నేపథ్య సంగీతం ప్రేక్షకులపై బలమైన ప్రభావాన్ని చూపుతోందని టాక్. విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. హిందూ సంఘాలు, పలువురు ఆధ్యాత్మిక వేత్తలు సైతం చిత్ర బృందాన్ని ప్రశంసించడం విశేషం.
Akhanda 2
Nandamuri Balakrishna
Balakrishna Akhanda 2
Boyapati Srinu
Akhanda movie
Telugu movies
Shiva Tandavam
Theater incident
Viral video
Hinduism

More Telugu News