Narendra Modi: ఢిల్లీలో అఖండ-2 స్పెషల్ స్క్రీనింగ్... వీక్షించనున్న ప్రధాని మోదీ!

Narendra Modi to watch Akhanda 2 special screening in Delhi
  • ప్రధాని మోదీ కోసం ఢిల్లీలో 'అఖండ 2' ప్రత్యేక ప్రదర్శన
  • ఈ విషయాన్ని వెల్లడించిన దర్శకుడు బోయపాటి శ్రీను
  • సినిమా విజయం దేవుడి సంకల్పమని వ్యాఖ్య
  • భారతదేశం ధర్మానికి గ్రంథాలయం వంటిదన్న బోయపాటి
  • 3డీలో చిత్రాన్ని రూపొందించామని వెల్లడి
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2’ చిత్రం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా ఒక షో వేయనున్నట్లు దర్శకుడు బోయపాటి శ్రీను వెల్లడించారు. సినిమాకు వస్తున్న స్పందన పట్ల కృతజ్ఞతలు తెలిపేందుకు ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలోనే బోయపాటి ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా బోయపాటి మాట్లాడుతూ.. 'అఖండ 2' చిత్రం గురించి విన్న ప్రధాని మోదీ, దానిని చూసేందుకు ఆసక్తి చూపారని తెలిపారు. త్వరలోనే ఢిల్లీలో ఈ స్పెషల్ స్క్రీనింగ్ ఉంటుందని, తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ఈ సినిమా విజయం పూర్తిగా దైవ సంకల్పమని ఆయన అన్నారు. "మనిషి అనుకుంటే గెలవొచ్చు, ఓడిపోవచ్చు. కానీ దేవుడు అనుకుంటే గెలుపు మాత్రమే ఉంటుంది. ఈ సినిమా విషయంలో అదే జరిగింది" అని బోయపాటి వ్యాఖ్యానించారు. భారతదేశం ధర్మానికి గ్రంథాలయం లాంటిదని, మన దేశం ధర్మానికి తల్లివేరని ఆయన పేర్కొన్నారు.

ఈ చిత్రాన్ని 3డీలో కూడా రూపొందించామని, ఇది ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని తెలిపారు. సినిమా నిర్మాణంలో ఏవైనా అడ్డంకులు ఎదురైనా, దేవుడే వాటిని తొలగించాడని బోయపాటి పేర్కొన్నారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Narendra Modi
Akhanda 2
Boyapati Srinu
Nandamuri Balakrishna
Telugu cinema
Special Screening
Delhi
Movie screening
Indian Prime Minister
Tollywood

More Telugu News