Prabhas: ప్రభాస్ 'రాజా సాబ్' నుంచి 'సహానా సహానా' సాంగ్ ప్రోమో ఇదిగో

Prabhas Raja Saab Sahana Sahana Song Promo Released
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, విలక్షణ దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజా సాబ్’. రొమాంటిక్ కామెడీ హారర్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి రెండో సింగిల్ ‘సహానా సహానా’ సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. ఇది ఒక సోల్‌ఫుల్ మెలోడీగా సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.

తమన్ స్వరపరిచిన ఈ మెలోడీకి కృష్ణకాంత్ (కేకే) సాహిత్యం అందించారు. స్పెయిన్‌లోని అందమైన లొకేషన్లలో ప్రభాస్, నిధి అగర్వాల్‌పై ఈ పాటను చిత్రీకరించారు. విడుదలైన ప్రోమోలో ప్రభాస్ తనదైన రొమాంటిక్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’కు మంచి స్పందన రాగా, ఇప్పుడు ఈ మెలోడీ ప్రోమోతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. పూర్తి పాటను డిసెంబర్ 17వ తేదీ సాయంత్రం 6:35 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. సంజయ్ దత్, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Prabhas
Raja Saab
Sahana Sahana
Maruthi
Nidhi Agarwal
Malavika Mohanan
Telugu movie
Romantic comedy
Thaman
Krishnakanth

More Telugu News