Telangana Panchayat Elections: తెలంగాణలో ముగిసిన రెండో దశ పంచాయతీ పోలింగ్.. మొదలైన ఓట్ల లెక్కింపు

Telangana Phase 2 Panchayat Elections Polling Ends Counting Begins
  • మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం
  • ఈరోజు సాయంత్రానికే వెలువడనున్న ఎన్నికల ఫలితాలు
  • స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్
  • 4,236 పంచాయతీలకు పోలింగ్ ప్ర‌క్రియ‌
తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియగా, 2 గంటల నుంచి అధికారులు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఈరోజు సాయంత్రానికే ఫలితాలు వెలువడనుండటంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మధ్యాహ్నం 1 గంటకే పోలింగ్ సమయం ముగిసినప్పటికీ, అప్పటికే క్యూ లైన్లలో నిల్చున్న ఓటర్లకు అధికారులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా కొన్ని స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పటికీ, మొత్తంగా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగిందని అధికారులు తెలిపారు.

ఈ రెండో దశలో భాగంగా మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు, 29,917 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, వార్డు సభ్యుల స్థానాలకు 71,071 మంది పోటీ పడ్డారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Telangana Panchayat Elections
Telangana
Panchayat Elections
Gram Panchayat Elections
Telangana Local Body Elections
Telangana Politics
Voting
Election Results

More Telugu News