Lionel Messi: భారత్‌లో మెస్సీ.. కానీ మ్యాచ్ ఆడకపోవడానికి కారణమిదే!

Why Lionel Messi Wont Play A Full Match In India
భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన లియోనెల్ మెస్సీ
కోల్‌కతా, హైదరాబాద్ సహా నాలుగు నగరాల్లో పర్యటన
భారీ ఇన్సూరెన్స్ కారణంగా లేని మ్యాచ్ ఆడే అవకాశం 
మెస్సీ ఎడమ కాలికి రూ.వేల కోట్ల విలువైన బీమా
క్లబ్, దేశం తరఫున కాకుండా ఇతర మ్యాచ్‌లు ఆడలేని నిబంధన
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ భారత్‌లో అడుగుపెట్టారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఆయన దేశానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ నగరాల్లో పలువురు ప్రముఖులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే, తమ అభిమాన ఆటగాడిని మైదానంలో చూడాలని ఆశించే భారతీయ అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. ఈ పర్యటనలో మెస్సీ పూర్తిస్థాయి మ్యాచ్ ఆడే అవకాశం దాదాపుగా లేదని తెలుస్తోంది.

దీనికి ప్రధాన కారణం మెస్సీకి ఉన్న అత్యంత ఖరీదైన ఇన్సూరెన్స్ పాలసీ. మీడియా కథనాల ప్రకారం ప్రపంచంలోనే అథ్లెట్లకు ఉన్న అతిపెద్ద బీమా కవరేజీలలో మెస్సీది ఒకటి. ఆయన ఎడమ కాలికి ఏకంగా 900 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 7,500 కోట్లు) వరకు బీమా ఉంది. ఈ పాలసీ నిబంధనల ప్రకారం ఆయన తన దేశం అర్జెంటీనా లేదా తను ప్రాతినిధ్యం వహిస్తున్న క్లబ్ ఇంటర్ మయామి తరఫున అధికారికంగా షెడ్యూల్ అయిన మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంటుంది.

స్నేహపూర్వక లేదా ప్రదర్శన మ్యాచ్‌లకు ఈ బీమా వర్తించదు. ఒకవేళ అలాంటి మ్యాచ్ ఆడుతూ గాయపడితే, మిలియన్ల డాలర్ల పరిహారం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే మెస్సీ పర్యటన కేవలం మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలకే పరిమితం కానుంది.

బాస్కెట్‌బాల్ దిగ్గజం మైఖేల్ జోర్డాన్‌కు తన కాంట్రాక్ట్‌లో 'లవ్ ఆఫ్ ది గేమ్' అనే ప్రత్యేక నిబంధన ఉండేది. దాని ప్రకారం ఆయన ఎక్కడైనా, ఎవరితోనైనా ఆడేందుకు స్వేచ్ఛ ఉండేది. కానీ మెస్సీ ఇన్సూరెన్స్‌లో అలాంటి వెసులుబాటు లేదు.


Lionel Messi
Messi India visit
Argentina football
Inter Miami
Messi insurance policy
football news
sports news
Kolkata
Hyderabad
Mumbai

More Telugu News