Srikanth Odela: శ్రీకాంత్ ఓదెల బర్త్‌డే.. స్పెషల్ వీడియో పోస్ట్ చేసిన‌ 'ది ప్యార‌డైజ్' యూనిట్

Srikanth Odela Birthday Special Post by The Paradise Team
  • 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు పుట్టినరోజు శుభాకాంక్షలు
  • విషెస్ తెలిపిన 'ది ప్యార‌డైజ్' చిత్ర యూనిట్
  • శ్రీకాంత్‌ను 'సైలెంట్ మాన్‌స్టర్' అంటూ అభివర్ణన
  • నానితో తెరకెక్కిస్తున్న తదుపరి చిత్రం 'ది ప్యార‌డైజ్'
  • 2026 మార్చి 26న పాన్ ఇండియా స్థాయిలో విడుదల
‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నేచురల్ స్టార్ నానితో తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘ది ప్యార‌డైజ్’ బృందం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది. చిత్ర నిర్మాణ సంస్థ ఎస్ఎల్‌వీ సినిమాస్ సోషల్ మీడియా వేదికగా శ్రీకాంత్ గురించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది.

"స్వతహాగా ఇంట్రోవర్ట్, నిశిత స్వభావం కలవారు. కానీ సెట్స్‌లో మాత్రం ఎంతో ప్యాషనేట్, ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటారు. ఆయనే మన ‘సైలెంట్ మాన్‌స్టర్’ శ్రీకాంత్ ఓదెలా. మా టీమ్ తరఫున మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు!" అంటూ చిత్రయూనిట్ తమ పోస్టులో పేర్కొంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘దసరా’ సినిమాలో నానిని పూర్తి మాస్ అవతారంలో చూపించిన శ్రీకాంత్, ‘ది ప్యార‌డైజ్’లో అంతకుమించి ఇంటెన్స్ లుక్‌లో ప్రెజెంట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం సహా మొత్తం ఎనిమిది భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Srikanth Odela
The Paradise
Dasara movie
Nani
SLV Cinemas
Telugu cinema
Pan India movie
Birthday wishes
Telugu movie director
March 2026 release

More Telugu News