Lionel Messi: మెస్సీ ప్రైవేట్ జెట్.. గాల్లో ఎగిరే ప్యాలెస్.. సౌకర్యాలు అదుర్స్!

Lionel Messi Gulfstream V Private Jet Details
  • ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీకి సొంతంగా ప్రైవేట్ జెట్
  • రూ.125 కోట్ల విలువైన గల్ఫ్‌స్ట్రీమ్ V జెట్‌లో మెస్సీ ప్రయాణం
  • జెట్ తోకపై 10వ నంబర్, మెట్లపై భార్యాపిల్లల పేర్లు
  • 16 సీట్లు, 2 బాత్రూమ్‌లతో విలాసవంతమైన సౌకర్యాలు
ఫుట్‌బాల్ ప్రపంచంలో దిగ్గజ ఆటగాడిగా పేరొందిన లియోనెల్ మెస్సీ, మైదానంలోనే కాదు బయట కూడా తనదైన రాజసంతో జీవిస్తాడు. ఆయన విలాసవంతమైన జీవనశైలికి నిదర్శనమే ఆయన సొంత ప్రైవేట్ జెట్. స్పానిష్ వార్తాపత్రిక మార్కా కథనాల ప్రకారం.. మెస్సీ వద్ద సుమారు 15 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 125 కోట్లు) విలువైన గల్ఫ్‌స్ట్రీమ్ V విమానం ఉంది. 2004లో తయారైన ఈ జెట్‌ను మెస్సీ 2018లో కొనుగోలు చేశాడు.

ఈ విమానంలో మెస్సీ వ్యక్తిగత అభిరుచులు స్పష్టంగా కనిపిస్తాయి. జెట్ తోక భాగంలో ఆయనకు ఎంతో ఇష్టమైన "10"వ నంబర్‌ను ముద్రించి ఉంటుంది. అలాగే విమానం మెట్లపై తన భార్య ఆంటోనెలా, ముగ్గురు పిల్లలు థియాగో, మాటియో, సిరో పేర్లను రాయించాడు. అర్జెంటీనాలో LV-IRQగా రిజిస్టర్ అయిన ఈ జెట్, సుదూర ప్రయాణాలకు అత్యంత అనుకూలం.

ప్రత్యేకతలు అమోఘం! 
ఈ జెట్‌లో పూర్తిస్థాయి కిచెన్, రెండు బాత్రూమ్‌లతో పాటు 16 సీట్లు ఉన్నాయి. అవసరమైతే ఈ సీట్లను 8 బెడ్లుగా మార్చుకునే సౌకర్యం కూడా ఉంది. దీనివల్ల సుదూర ప్రయాణాల్లో ఆటగాళ్లు, సిబ్బంది సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకోవచ్చు. క్లబ్, అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం తరచూ ఖండాలు దాటి ప్రయాణించే మెస్సీకి ఈ విమానం ఎంతగానో ఉపయోగపడుతుంది.

గల్ఫ్‌స్ట్రీమ్ V మోడల్‌ను 1997లో ప్రవేశపెట్టారు. శక్తివంతమైన రోల్స్ రాయిస్ ఇంజిన్లతో నడిచే ఈ విమానం, అద్భుతమైన పనితీరు, భద్రతకు పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు ఇలాంటి విమానాలనే వినియోగిస్తుంటారు. దీనికంటే ముందు కూడా మెస్సీ దాదాపు 35 మిలియన్ డాలర్ల విలువైన ఎంబ్రేయర్ లెగసీ 650 అనే మరో జెట్‌ను ఉపయోగించడం విశేషం.
Lionel Messi
Messi private jet
Gulfstream V
private jet
football
Antonela Roccuzzo
luxury lifestyle
soccer
Argentina
LV-IRQ

More Telugu News