మంటగలుస్తున్న మానవ సంబంధాలు... బీమా డబ్బు కోసం మామ హత్య!
- బీమా డబ్బుల కోసం సొంత మామను హత్య చేసిన అల్లుడు, మనవడు
- రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన వైనం
- రూ.1.08 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలే హత్యకు అసలు కారణం
- ఎల్ఐసీ ఏజెంట్‌తో సహా మొత్తం నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బీమా సొమ్ము కోసం కన్నవారిలా ఆదరించాల్సిన మామనే అల్లుడు, మనవడు కలిసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘోరాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని ప్రయత్నించారు. అయితే, పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టి హత్య మిస్టరీని ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశంలో వెల్లడించారు.
కసింకోట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కుర్రు నారాయణమూర్తి (54) మృతదేహాన్ని ఈ నెల 9న పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో మరణించాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినప్పటికీ, మృతదేహంపై ఉన్న గాయాలను చూసి పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా, నారాయణమూర్తి పేరు మీద ఆరు నెలల క్రితం వివిధ కంపెనీల నుంచి రూ.1.08 కోట్ల విలువైన బీమా పాలసీలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
నారాయణమూర్తి మరణిస్తే ఆ బీమా డబ్బులు తమకు వస్తాయనే దురాశతో అల్లుడు సుంకరి అన్నవరం, మనవడు సుంకరి జ్యోతి ప్రసాద్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టి అతడిని హత్య చేశారని తెలిపారు. ఈ హత్యకు సహకరించిన ఎల్ఐసీ ఏజెంట్ భీముని నానాజీ, మరో వ్యక్తి అగ్రహారపు తాతాజీని కూడా అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన కసింకోట సీఐ స్వామి నాయుడు, ఎస్ఐ మనోజ్ లక్ష్మణరావులను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.