Telangana Road Accident: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం... ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Telangana Road Accident Four of a Family Died
  • పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి గ్రామ సమీపంలో దుర్ఘటన
  • పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళుతుండగా ప్రమాదం
  • మృతులను కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల వాసులుగా గుర్తింపు
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పెద్ద శంకరంపేట మండలం, కోలపల్లి గ్రామ సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ కుటుంబం హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతులను లింగమయ్య, సాయమ్మ, సాయిలు, మానసలుగా గుర్తించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Telangana Road Accident
Medak District
Road Accident
Telangana Panchayat Elections
Kolapalli Village
Nizam Sagar
Fatal Accident
Family Death

More Telugu News