మెస్సీ ఈవెంట్ లైవ్ చూడాలనుకుంటున్నారా... ఇవిగో డీటెయిల్స్!

  • భారత్‌లో పర్యటిస్తున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ
  • నేటి నుంచి 15వ తేదీ వరకు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో టూర్
  • డీడీ స్పోర్ట్స్, ప్రసారభారతి యూట్యూబ్‌లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం
  • 'వేవ్స్ ఓటీటీ'లోనూ లైవ్ స్ట్రీమింగ్
  • ఎగ్జిబిషన్ మ్యాచ్, పెనాల్టీ షూటౌట్ వంటివి ప్రత్యేక ఆకర్షణ
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 'గోట్ ఇండియా టూర్' లైవ్ చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వివరాలు మీకోసమే. మెస్సీ పర్యటనను వీక్షించేందుకు అభిమానుల కోసం పలు ప్రసార మాధ్యమాలు సిద్ధమయ్యాయి. ఈ టూర్‌ను డీడీ స్పోర్ట్స్ ఛానెల్‌లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే ప్రసారభారతి అధికారిక యూట్యూబ్ ఛానెల్ లోనూ, కొత్తగా ప్రారంభించిన 'వేవ్స్ ఓటీటీ' ప్లాట్‌ఫామ్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. ఇక డిజిటల్ సబ్‌స్క్రైబర్లు సోనీలివ్ యాప్‌లో కూడా ప్రత్యేక ఇంటర్వ్యూలు, మ్యాచ్‌ల కవరేజీని చూడవచ్చు.

దాదాపు 14 ఏళ్ల తర్వాత మెస్సీ భారత్‌కు రావడంతో మేనియా మామూలుగా లేదు. డిసెంబర్ 13న కోల్‌కతాలో మెస్సీ టూర్ ప్రారంభం అయింది. ఈ సాయంత్రం హైదరాబాదులో మెస్సీ ఈవెంట్ ఉంది. ఆ తర్వాత డిసెంబర్ 14న ముంబై, 15న ఢిల్లీలో మెస్సీ పర్యటిస్తాడు. ఈ మూడు రోజుల పర్యటనలో అతడి అభిమానులతో ముచ్చటించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు.

ఈ పర్యటనలో భాగంగా హైదరాబాదులో భారత, అంతర్జాతీయ ఆటగాళ్లతో కూడిన ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్, పెనాల్టీ షూటౌట్లు, మాస్టర్‌క్లాస్ సెషన్లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కార్యక్రమం చివర్లో మెస్సీకి ఘనంగా సన్మానం చేసి, అతడి కెరీర్‌ను ఉద్దేశించి ఒక ప్రత్యేక సంగీత కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు.


More Telugu News