KTR: రామేశ్వరం కేఫ్‌లో కలిసి టిఫిన్ చేసిన కేటీఆర్, అఖిలేశ్ యాదవ్

KTR Akhilesh Yadav Have Breakfast Together at Rameshwaram Cafe
  • మధ్యాహ్నం రామేశ్వరం కేఫ్‌కు చేరుకున్న ఇరువురు నేతలు
  • కేటీఆర్, అఖిలేశ్‌లకు ఘన స్వాగతం పలికిన కేఫ్ యజమాని
  • ఆహార పదార్థాలు అద్భుతంగా ఉన్నాయంటూ యజమానికి ప్రశంస
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్ నగరంలో కలిసి టిఫిన్ చేశారు. నగరంలోని రామేశ్వరం కేఫ్‌కు మధ్యాహ్నం చేరుకున్న ఇరువురు నేతలకు కేఫ్ యజమాని శరత్ స్వాగతం పలికారు.

అనంతరం ఇరువురు రామేశ్వరం కేఫ్‌లోని రుచులను ఆస్వాదిస్తూ రాజకీయ, సమకాలీన అంశాలపై చర్చించారు. కేఫ్‌లోని ఆహార పదార్థాలు అద్భుతంగా ఉన్నాయని యజమాని శరత్‌ను అభినందించారు. టిఫిన్ అనంతరం ఇరువురు నేతలు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లారు.
KTR
KTR Akhilesh Yadav
Akhilesh Yadav
Rameshwaram Cafe
Telangana Politics
BRS

More Telugu News