ఐబొమ్మ రవి కస్టడీలో ఉండగా 'అఖండ 2' పైరసీ ఎలా వచ్చింది?: సీపీఐ నారాయణ

  • థియేటర్లలో అధిక ధరలతో సామాన్యులను దోపిడీ చేస్తున్నారన్న నారాయణ
  • ప్రభుత్వాలు మల్టీప్లెక్స్‌లను కట్టడి చేయాలని డిమాండ్
  • టికెట్ల ధరల వల్లే ప్రేక్షకులు థియేటర్లకు దూరమవుతున్నారని వ్యాఖ్య
సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు మితిమీరిన టికెట్ ధరలు, అధిక ధరలకు అమ్ముతున్న స్నాక్స్‌తో సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నాయని సీపీఐ నేత నారాయణ తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని థియేటర్ల యాజమాన్యాల దోపిడీని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ-2' చిత్రం విడుదలైన రోజే పైరసీకి గురైన ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఐబొమ్మ రవిని ఉరితీయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, అయితే అలా చేసినంత మాత్రాన పైరసీ ఆగదని నారాయణ స్పష్టం చేశారు. అసలు నిందితుడు పోలీసు కస్టడీలో ఉండగానే సినిమా ఎలా బయటకు వచ్చిందని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

పైరసీకి మూల కారణాలు వ్యవస్థాగత లోపాలలోనే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం టికెట్ ధరలు పెంచుకుని లాభాలు పొందాలనుకోవడం సరికాదన్నారు. ప్రేక్షకులపై ఇలా ఆర్థిక భారం మోపడం వల్లే వారు పైరసీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారని, అందుకే థియేటర్లకు జనం రావడం తగ్గిపోయిందని విశ్లేషించారు.


More Telugu News