Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్

Lionel Messi Kolkata Event Organizer Arrested After Chaos
  • కోల్‌కతాలో మెస్సీ 'గోట్ టూర్' ఈవెంట్‌లో రసాభాస
  • మెస్సీ కనిపించకపోవడంతో అభిమానుల తీవ్ర ఆగ్రహం
  • స్టేడియంలో కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరిన ఫ్యాన్స్
  • ఎఫ్‌ఐఆర్ నమోదు.. ప్రధాన నిర్వాహకుడు శతద్రు దత్త అరెస్ట్
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని చూసేందుకు కోల్‌కతాలో ఏర్పాటు చేసిన 'గోట్ టూర్' ఈవెంట్ తీవ్ర గందరగోళానికి దారి తీసింది. వేలకు వేలు పోసి టికెట్లు కొన్నా తమ అభిమాన ఆటగాడిని సరిగ్గా చూడలేకపోయామంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిర్వాహకుడు శతద్రు దత్తను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే... కోల్‌కతాలోని యువ భారతి క్రీడాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. రూ.5,000 నుంచి రూ.25,000 వరకు వెచ్చించి అభిమానులు టికెట్లు కొనుగోలు చేశారు. అయితే, మెస్సీ చుట్టూ భద్రతా సిబ్బంది, ఇతర అతిథులు ఉండటంతో స్టాండ్స్‌లో ఉన్న వారికి అతను స్పష్టంగా కనిపించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్ కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసరడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పరిస్థితి అదుపు తప్పుతుండటంతో నిర్వాహకులు మెస్సీని హుటాహుటిన అక్కడి నుంచి తీసుకెళ్లారు. వాస్తవానికి మెస్సీ స్టేడియంలో ఒక రౌండ్ వేయాల్సి ఉన్నా, గందరగోళం కారణంగా అది సాధ్యపడలేదు. అతను ఉదయం 11:15 గంటలకు వేదిక వద్దకు వచ్చి కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉన్నారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ప్రధాన నిర్వాహకుడైన శతద్రు దత్తను అరెస్ట్ చేశామని ఏడీజీ (శాంతిభద్రతలు) జావేద్ షమీమ్ ధృవీకరించారు.
Lionel Messi
Messi Kolkata event
Goat Tour Kolkata
Shatadru Datta
Kolkata Football
Yuva Bharati Krirangan
Messi India visit
Football event chaos
ADG Javed Shamim

More Telugu News