బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌

  • బాక్సాఫీస్ వద్ద బాలయ్య ‘అఖండ 2’ ప్రభంజనం
  • తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 59.5 కోట్ల వసూళ్లు
  • నటసింహం కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్
  • భారీ అంచనాల మధ్య విడుదలైన సీక్వెల్
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల నడుమ నిన్న‌ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలిరోజే రూ. 59.5 కోట్లు గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

ఈ భారీ వసూళ్లతో బాలకృష్ణ తన కెరీర్‌లోనే అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ‘అఖండ 2’ నిలిచింది. ప్రీమియర్ షోలతో కలిపి ఈ మొత్తం వసూలైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్ల‌స్‌ అధికారికంగా ప్రకటించింది. 2021లో విడుదలై సంచలనం సృష్టించిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

బాలయ్య నటనకు, బోయపాటి టేకింగ్‌కు మంచి స్పందన
ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో బాలకృష్ణ పవర్‌ఫుల్ నటన, బోయపాటి శ్రీను టేకింగ్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా కావడంతో విడుదల ముందు నుంచే దీనిపై భారీ అంచనాలు నెలకొనడం, అవి ఇప్పుడు నిజం కావడం విశేషం.


More Telugu News