Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి

Kalluri Balaraju Loses Election Recovers Money From Villagers
  • నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవాని గ్రామంలో ఘటన
  • బీఆర్ఎస్ మద్దతుదారుగా పోటీ చేసిన బాలరాజు
  • కాంగ్రెస్ మద్దతుదారు జక్కల పరమేశ్ విజయం
  • దేవుడి ఫొటోతో ఊళ్లో తిరుగుతూ డబ్బులు వసూలు చేసిన బాలరాజు
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని ఔరవాని గ్రామంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా ఎన్నికల్లో ఓటు వేయడానికి డబ్బు, మద్యం పంపిణీ చేయడం తెలిసిందే. అయితే, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఒక అభ్యర్థి, ఎన్నికల ముందు గ్రామస్థులకు ఇచ్చిన డబ్బులను తిరిగి వసూలు చేసుకున్నాడు.

ఔరవానికి చెందిన కల్లూరి బాలరాజు అనే వ్యక్తి బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జక్కల పరమేశ్ కూడా బరిలో నిలిచాడు. రెండు రోజుల క్రితం జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పరమేశ్, బాలరాజుపై 450 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో బాలరాజు దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.

తక్కువ ఓట్లతో ఓడిపోతే పట్టించుకునేవాళ్లం కాదని, కానీ 450 ఓట్ల తేడాతో ఓటమి పాలవ్వడంతో డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నామని బాలరాజు కుటుంబ సభ్యులు తెలిపారు. బాలరాజు ఒక చేత్తో దేవుడి ఫొటో పట్టుకుని, తనకు ఓటు వేసినవారు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాలని, లేదంటే తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతూ ఊరంతా తిరిగాడు. చాలామంది వద్ద డబ్బులు వసూలు చేసుకున్నాడు.
Kalluri Balaraju
Nalgonda
Narketpally
Auravani
Sarpanch Election
Telangana Elections

More Telugu News