Deepika: తమ ఊరికి రోడ్డు లేదన్న అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక... కొన్ని గంటల్లోనే నిధులు మంజూరు చేసిన పవన్

Deepika Request Leads to Swift Road Funds Approval by Pawan Kalyan
  • అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం తక్షణ స్పందన
  • మా ఊరికి రోడ్డు లేదని చెప్పడంతో గంటల వ్యవధిలోనే చర్యలు
  • మడకశిర నియోజకవర్గంలోని తంబలహెట్టి గ్రామానికి రోడ్ల నిర్మాణం
  • రెండు రోడ్ల కోసం మొత్తం రూ.6.2 కోట్ల నిధులు మంజూరు
ఇటీవల వరల్డ్ కప్ భారత అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక చేసిన ఒక విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గంటల వ్యవధిలోనే స్పందించి, ఆమె స్వగ్రామానికి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. పరిపాలనలో తనదైన వేగాన్ని చూపిస్తూ, ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. తన స్వగ్రామమైన మడకశిర నియోజకవర్గం, అమరాపురం మండలం, హేమావతి పంచాయతీ పరిధిలోని తంబలహెట్టికి సరైన రోడ్డు మార్గం లేక గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులను దీపిక ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వినతిని స్వీకరించిన పవన్ కల్యాణ్, రోడ్డు వేయిస్తానని అక్కడికక్కడే హామీ ఇచ్చారు.

ఆ హామీ ఇచ్చిన కొద్ది గంటల్లోనే పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. రోడ్లను పరిశీలించి నిర్మాణానికి సంబంధించిన అంచనాలను సిద్ధం చేశారు. హేమావతి నుంచి తంబలహెట్టి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టి వరకు 5 కిలోమీటర్ల రోడ్డుకు రూ.3 కోట్లు అవసరమని అధికారులు నివేదిక ఇచ్చారు. 

ఈ అంచనాలకు ఉప ముఖ్యమంత్రి వెంటనే ఆమోదం తెలిపి, మొత్తం రూ.6.2 కోట్ల నిధులను మంజూరు చేశారు. అడిగిన వెంటనే హామీ ఇవ్వడమే కాకుండా, గంటల వ్యవధిలోనే నిధులు మంజూరు చేయడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Deepika
অন্ধుల క్రికెట్
Pawan Kalyan
Andhra Pradesh
Road Construction
Funds Sanctioned
Madakasira
Hemavathi
অন্ধుల మహిళా క్రికెట్ జట్టు
TDP

More Telugu News