Venkatesh: చిరు సినిమాలో వెంకీ మామ.. బర్త్‌డే రోజున స్టైలిష్ లుక్ విడుదల

Venkatesh Stylish Look Released from Chiranjeevi Movie on Birthday
  • చిరంజీవి 'మన శంకర వరప్రసాద్‌ గారు' చిత్రంలో వెంకటేశ్
  • పుట్టినరోజు సందర్భంగా వెంకీ స్టైలిష్ లుక్ విడుదల
  • హెలికాప్టర్‌లో ల్యాండ్ అవుతూ గన్‌మన్ల మధ్య పవర్‌ఫుల్ ఎంట్రీ
ఇవాళ విక్టరీ వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక లభించింది. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం నుంచి వెంకటేశ్ లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

విడుదల చేసిన పోస్టర్‌లో వెంకటేశ్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. హెలికాప్టర్ నుంచి దిగి, గన్‌మన్ల పహారా మధ్య నడిచివస్తున్న ఆయన లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో వెంకీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని, అదే సమయంలో ఆయన మార్క్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని ఈ పోస్టర్ హింట్ ఇస్తోంది.

ఈ చిత్రంలో చిరంజీవి, వెంకటేశ్ మధ్య వచ్చే సన్నివేశాలు, వారిద్దరిపై చిత్రీకరించే పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, వీటీవీ గణేశ్‌, కేథరిన్ థ్రెసా, హర్షవర్ధన్ వంటి నటులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

షైన్ స్క్రీన్స్, గోల్డ్‌ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్ప‌టికే అధికారికంగా ప్రకటించారు.


Venkatesh
Chiranjeevi
Mana Shankara Vara Prasad Garu
Anil Ravipudi
Telugu Movie
Tollywood
Nayanthara
Sankranti 2026
Venkatesh Birthday
Victory Venkatesh

More Telugu News