నా పోస్టులను అణచివేస్తున్నారు.. ఎలాన్ మస్క్‌కు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య ఫిర్యాదు
- ఇమ్రాన్ ఖాన్ విషయంలో తన పోస్టులను అణచివేస్తున్నారన్న జెమీమా
- ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు బహిరంగంగా విజ్ఞప్తి
- ఇమ్రాన్‌ను కుమారులతో కలవనివ్వడం లేదని ఆవేదన
- ఆయనొక రాజకీయ ఖైదీ అని, హక్కులను కాలరాస్తున్నారని ఆరోపణ
- ఇమ్రాన్‌ను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆయన సోదరి ఆరోపణ
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' అధినేత ఎలాన్ మస్క్‌కు బహిరంగ విజ్ఞప్తి చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఎదుర్కొంటున్న పరిస్థితులపై తాను పెడుతున్న పోస్టులను ఎక్స్ వేదికగా అణచివేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఇమ్రాన్ ఖాన్ నిర్బంధం, ఆయనకు పాక్ అధికారులు కల్పిస్తున్న ఇబ్బందుల గురించి తాను చేసే అప్‌డేట్స్ ప్రజలకు చేరడం లేదని జెమీమా ఆవేదన వ్యక్తం చేశారు. తన ఖాతాపై ఉన్న 'విజిబిలిటీ ఫిల్టరింగ్'ను సరిచేయాలని మస్క్‌ను కోరారు. "మీరు వాక్ స్వాతంత్ర్యం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఎవరూ వినని ప్రసంగం గురించి కాదు కదా?" అని ఆమె మస్క్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కనీసం తన కుమారులు కూడా ఆయన్ను కలిసేందుకు అనుమతించడం లేదని జెమీమా తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ ప్రాథమిక మానవ హక్కులు లేని ఒక రాజకీయ ఖైదీ అని ప్రపంచానికి చెప్పడానికి తనకు 'ఎక్స్' మాత్రమే మిగిలి ఉందని, కానీ దాని రీచ్‌ను కూడా దాదాపు సున్నాకు తగ్గించేశారని ఆమె ఆరోపించారు.
ఇదే విధమైన ఆందోళనను ఇమ్రాన్ ఖాన్ సోదరి అలేమా ఖాన్ కూడా ఇటీవలే వ్యక్తం చేశారు. అడియాలా జైలు వెలుపల ఆమె మాట్లాడుతూ.. "గత 8 నెలలుగా మేమిక్కడికి వస్తున్నాం. మమ్మల్ని ఇమ్రాన్‌తో కలవనివ్వడం లేదు. ఆయన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఈ హింసను ఆపాలి" అని ఆమె డిమాండ్ చేశారు.
గత ఏడాది జులైలో ఐక్యరాజ్యసమితి నిపుణుల బృందం కూడా ఇమ్రాన్ ఖాన్ నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఆయన్ను అక్రమంగా నిర్బంధించారని, రాజకీయాలకు దూరం పెట్టేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారని విమర్శించిన విషయం తెలిసిందే.