Pawan Kalyan: పవన్ కల్యాణ్ నోట 'దేఖ్ లేంగే సాలా' పాట... వీడియో ఇదిగో!

Pawan Kalyan hums Dekh Lenge Salaa from Ustaad Bhagat Singh
  • పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి తొలి పాట విడుదలకు సిద్ధం
  • 'దేఖ్ లేంగే సాలా' అంటూ సాగనున్న ఈ సాంగ్
  • రేపు సాయంత్రం 6:30 గంటలకు విడుదల
  • పాట చూశాక పవన్ హమ్ చేస్తున్న వీడియోను పంచుకున్న చిత్రబృందం
  • పవన్, హరీశ్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్ కాంబోపై భారీ అంచనాలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేసేందుకు చిత్రబృందం అన్ని ఏర్పాట్లు చేసింది. 'దేఖ్లేంగే సాలా' అంటూ సాగే ఈ పవర్‌ఫుల్ సాంగ్‌ను రేపు సాయంత్రం 6:30 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను పంచుకుంది. ఈ వీడియోలో పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ పాట ఫైనల్ వెర్షన్‌ను చూడడం గమనించవచ్చు. పాట పూర్తయిన తర్వాత పవన్ కల్యాణ్ ఎంతో ఉత్సాహంగా ఆ ట్యూన్‌ను హమ్ చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. "పాట చూశాక పవన్ కల్యాణ్ 'దేఖ్లేంగే సాలా' అని హమ్ చేయడం మొదలుపెట్టారు. రేపు సాయంత్రం 6:30 నుంచి తెలుగు ప్రేక్షకులు కూడా ఇదే పాటను హమ్ చేస్తారు" అని చిత్రబృందం ట్వీట్ చేసింది.

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు విశాల్ దద్లానీ ఈ పాటను ఆలపించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. తాజా ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
Pawan Kalyan
Ustaad Bhagat Singh
Harish Shankar
ദേഖ് ലേംഗേ സാല ഗാനം
దేవి శ్రీ ప్రసాద్
Sreeleela
మైత్రీ మూవీ మేకర్స్
Vishal Dadlani
Tollywood
Telugu movie

More Telugu News