Telangana Weather: తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Telangana Cold Wave Intensifies Yellow Alert Issued
  • ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల రాష్ట్రంలో చలి తీవ్రత
  • ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పడిపోయినట్లు వెల్లడి
  • ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో చలి గాలుల ప్రభావం అధికం
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల మేర కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయని పేర్కొంది. ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో చలి గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది.

శుక్రవారం, శనివారం శీతల, అతి శీతల పవనాలు వీచే అవకాశం ఉన్నందున ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు. రానున్న రోజుల్లో పొగమంచు పెరిగే అవకాశం ఉందని అన్నారు. శీతల గాలులు, పొగమంచు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Telangana Weather
Telangana cold wave
Hyderabad weather
Telangana temperature
Cold weather alert

More Telugu News