Akhanda 2: 'అఖండ 2' హైలైట్స్ ఇవే!

Akhanda 2 Movie Update
  • భారీ అంచనాల మధ్య విడుదలైన 'అఖండ 2'
  • మాస్ ను ఆకట్టుకునే యాక్షన్ సీన్స్ 
  • అబ్బురపరిచే 'టిబెట్' లొకేషన్స్
  • ప్రత్యేక ఆకర్షణగా మహాకుంభమేళా విజువల్స్  
  • గుర్తుండిపోయే పవర్ఫుల్ డైలాగ్స్ 
బాలకృష్ణ కథానాయకుడిగా గతంలో వచ్చిన 'అఖండ' సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన 'అఖండ 2' ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. 14 రీల్స్ ప్లస్ వారు నిర్మించిన ఈ సినిమాకి బోయపాటి దర్శకత్వం వహించాడు. బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ అనగానే తెరపై భారీ ఆవిష్కరణ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. ఈ సినిమా కూడా అదే విషయాన్ని మరోసారి నిరూపించిందని చెప్పచ్చు. 

బాలకృష్ణ సినిమా నుంచి మాస్ ఆడియన్స్ ఆశించేది యాక్షన్ ఎపిసోడ్స్. రామ్ - లక్ష్మణ్, రవివర్మ కంపోజ్ చేసిన యాక్షన్ దృశ్యాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. గంజాయి మాఫియాతోను .. తాంత్రికుడైన 'నేత్ర'తోను .. చివర్లో త్రిశూలం - గదా వంటి ఆయుధాలతో బాలకృష్ణ చేసే ఫైట్స్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. అరచేతిలో ఓ రౌడీని తలక్రిందులుగా పట్టుకుని 'దిష్టి' తీయడం కొత్తగా అనిపిస్తుంది. అలాగే మహాకుంభమేళా ఒరిజినల్ విజువల్స్ కూడా గొప్పగా అనిపిస్తాయి. మంచు పర్వతాలు .. సెలయేళ్లతో కూడిన 'టిబెట్' లొకేషన్స్ విస్మయులను చేస్తాయి.

ఇక బాలయ్య అంటేనే పవర్ ఫుల్ డైలాగ్స్ కి పెట్టింది పేరు. ఈ సినిమాలో మనకి కనెక్ట్ అయ్యే డైలాగ్స్ చాలానే వినిపిస్తాయి. 'భారతీయుల ధైర్యమే వాళ్లు నమ్మే దైవం' .. 'నేను లే అవుట్ కాదురా .. బ్లో అవుట్' .. 'ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు' .. 'సింహాన్ని గెలవాలంటే నక్కలతో స్నేహం చేయాలి' ..' నీది క్షుద్రనీతి .. నాది రుద్రనీతి' .. 'ఎవరి ప్రాణాలనైనా శాసించేది రెండే రేడు ఒకటి కాలం .. మరొకటి శూలం' .. 'మీది నియంతల చరిత్ర .. మాది నిరంతర చరిత్ర' వంటి డైలాగ్స్ గుర్తుండిపోతాయి. ఇలా 'అఖండ 2' సినిమాకి యాక్షన్ సీన్స్ .. లొకేషన్స్ .. డైలాగ్స్ .. నేపథ్య సంగీతం హైలైట్ గా నిలిచాయని చెప్పచ్చు.  

Akhanda 2
Balakrishna
Boyapati Srinu
Akhanda sequel
Telugu movies
action scenes
mass audience
dialogues
Ram Lakshman
Ravi Varma

More Telugu News