China: కండోమ్ లపై పన్ను పెంచిన చైనా.. జనంలో సుఖ వ్యాధుల భయం

China Increases Tax on Condoms Amid Falling Birth Rates
  • జనవరి 1 నుంచి కాంట్రాసెప్టివ్ మందులపైనా పన్ను బాదుడు
  • జననాల రేటు పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
  • పిల్లలను పెంచడంతో పోలిస్తే రేట్లు పెంచినా కండోమ్ లే చవక అంటూ చైనా యువత జోక్ లు
జననాల రేటు తగ్గిపోవడంతో చైనా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గతంలో ‘ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు’ అన్న ప్రభుత్వమే ఇప్పుడు పిల్లలను కనాలంటూ దేశ ప్రజలకు పిలుపునిస్తోంది. ఇందుకోసం వినూత్న చర్యలు కూడా చేపట్టింది. గర్భనిరోధక సాధనాల వాడకాన్ని తగ్గించే ఉద్దేశంతో కండోమ్ లు, కాంట్రాసెప్టివ్ మందులపై పన్ను పెంచింది. జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. పిల్లలను కనడానికి, వారి పెంపకానికి సంబంధించి పలు ప్రోత్సహాకాలనూ ప్రకటించింది. మాతృత్వ సెలవులతో పాటు నగదు ప్రోత్సాహకాలను అందించనున్నట్లు తెలిపింది.
 
కండోమ్ లు, కాంట్రాసెప్టివ్ మందులపై పన్నుల భారం పెరగనున్న నేపథ్యంలో చైనా యువతలో మిశ్రమ స్పందన లభిస్తోంది. ప్రభుత్వ నియంత్రణలోని మీడియాలో ఈ విషయంపై ఎక్కువగా ప్రచారం జరగకున్నా సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతోంది. కండోమ్ లపై వాల్యూ యాడెడ్ టాక్స్ పెంపుపై యువతలో ఆందోళన వ్యక్తమవుతోంది. కండోమ్ ల వాడకం తగ్గి సుఖ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ విషయంపై నెట్టింట పలు జోక్ లు, మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. దేశంలో పిల్లల పెంపకం కన్నా రేట్లు పెరిగినా సరే కండోమ్ లు కొనడమే చవక అని జోక్స్ వెల్లువెత్తుతున్నాయి. పెరిగిన ఖర్చుల వల్ల పిల్లలను కనడం, పెంచడం తలకుమించిన భారంగా మారిందని చాలామంది వాపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు ఏమూలకూ సరిపోవని విమర్శిస్తున్నారు.
China
China birth rate
Condom tax
Contraceptives tax
STDs
China population
Fertility rate
China policy
Value added tax
VAT

More Telugu News