Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడి బర్త్ డే పార్టీ.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

Duvvada Srinivas Birthday Party Busted by Police in Moinabad
  • మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో దువ్వాడ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుక
  • అనుమతి లేదంటూ పార్టీని అడ్డుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు
  • అక్రమ మద్యం, హుక్కా పాట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మద్యం పార్టీపై స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే... మొయినాబాద్‌లోని ‘ది పెండెంట్’ ఫామ్‌హౌస్‌లో దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు పార్థసారథి తన పుట్టినరోజు వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి దువ్వాడ శ్రీనివాస్‌, మాధురి దంపతులు కూడా హాజరయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఫామ్‌హౌస్‌పై దాడి చేసిన పోలీసులు, అక్కడ అనుమతి లేకుండా మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ దాడుల్లో 7 మద్యం బాటిళ్లను, హుక్కా పాట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పార్టీలో మొత్తం 29 మంది పాల్గొన్నట్లు సమాచారం. అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించినందుకు గాను పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
Duvvada Srinivas
Duvvada Madhuri Srinivas
Birthday Party
Ranga Reddy District
Moinabad
Farmhouse Raid
SOT Police
Illegal Liquor
Hyderabad
Telangana

More Telugu News