Nara Lokesh: ‘అఖండ 2’పై నారా లోకేశ్ ట్వీట్.. బాలయ్య నటనపై ప్రశంసలు
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన ‘అఖండ 2’ చిత్రంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
‘‘అఖండ 2 సినిమాలో బాలా మామయ్య నట తాండవం ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. గాడ్ ఆఫ్ మాసెస్ మూవీ అంటే సౌండ్ బాక్సులు బద్దలయ్యే విజయ నినాదం’’ అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో బాలకృష్ణ మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారని లోకేశ్ అభినందించారు. ఈ సందర్భంగా ‘అఖండ 2’ చిత్ర బృందానికి ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.