Konda Surekha: మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Konda Surekha Nampally Court Issues Non Bailable Warrant
  • కొండా సురేఖ తనపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ పరువు నష్టం కేసు
  • కేసులో విచారణకు హాజరు కాని కొండా సురేఖ
  • తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మంత్రి సురేఖ తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణకు ఆమె హాజరు కాలేదు. దీంతో నాంపల్లి కోర్టు ఆమెపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

పిటిషన్‌పై విచారణ సందర్భంగా కొండా సురేఖ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీలోపు కొండా సురేఖ నేరుగా కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
Konda Surekha
Konda Surekha case
KTR
KTR defamation case
Nampally court
Telangana Minister

More Telugu News